Nara Bhuvaneshwari : సంఫీుభావం తెలపటం కూడా నేరమేనా ?

0

 


టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరిని (Nara Bhuvaneshwari)  కలిసేందుకు టీడీపీ శ్రేణులు ‘‘సంఫీుభావ యాత్ర’’ (Sanghibhava yatra)కు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ...‘‘చంద్రబాబుగారికి మద్దతుగా రాజమండ్రిలో (Rajamandry) ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఫీుభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కెక్కడిది?’’ అంటూ భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సతీమణి భువనేశ్వరి ఎంతో మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన వెంటనే రాజమండ్రికి చేరుకున్న భువనేశ్వరి.. ఆయనకు మద్దతుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ నుంచి రాజమండ్రిలోనే బస చేస్తున్న భువనేశ్వరిని ప్రతీరోజు అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసి పరామర్శిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !