Nara Bhuvaneshwari : నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర !

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభమైంది. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రగిరి బజారువీధిలో.. ప్రవీణ్‌రెడ్డి ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రవీణ్‌రెడ్డి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో అదే ఆలోచనతో ఈనెల 18వ తేదీన ఆవులపల్లి ప్రవీణ్‌ రెడ్డి మృతి చెందారు. ఆయా కుటుంబాలకు చెరో రూ.3లక్షల చెక్కును అందజేశారు. ధైర్యంగా ఉండాలని.. తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు. వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు. నారా భువనేశ్వరి తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు.

లోకేష్‌ సమర్థుడైతే తల్లిని రోడ్ల మీదకు ఎందుకు పంపుతారు ` కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు !

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారు అంటూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడుతు..చంద్రబాబు వారసుడు లోకేష్‌ సమర్థుడు, మగాడు అంటున్నారు. మరి లోకేశ్‌ సమర్ధుడైతే.. ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారు..? అని ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు. లోకేష్‌ పప్పు అని మరోసారి రుజువైందని..లోకేశ్‌ ఢల్లీి పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అంటూ ఆరోపించారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు..? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారు..? రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ.2వేల కోట్లు దాటింది అన్నారు. 40 రోజుల్లో ఢల్లీి లాయర్లకు రూ. 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు..? కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొడాలి పవన్‌ కల్యాణ్‌ పై కూడా మరోసారి విమర్శలు సంధిస్తు..2019 ఎన్నికల్లో కూడా పవన్‌ కల్యాణ్‌ తెరవనుక నుండి టిడిపికి మద్దతుగా ఉన్నారని..ఇప్పుడు మరోసారి ముసుగు తొలగింది అంతే అన్నారు. వవన్‌ పార్టీ పెట్టింది తన కోసం కాదు చంద్రబాబు కోసమే అన్నారు. పవన్‌ కల్యాణ్‌ జనసున్నా పార్టీ పెట్టారు అంటూ ఎద్దేవా చేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !