Lokesh Met Amit Shah: నారా లోకేష్‌కి అమిత్‌ షా హామీ ఇచ్చారా ?

0

దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌ బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కారు కక్షసాధింపు చర్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు, విచారణ పేరుతో తనను వేధిస్తున్నట్లు కేంద్రమంత్రికి వివరించారు. చివరకు తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్‌.. అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు.చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీపై ఎన్ని కేసులు పెట్టారు? అని అమిత్‌ షా.. లోకేష్‌ని అడిగి తెలసుకున్నారు. కక్ష సాధింపుతో జగన్‌ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్‌ షాకు నారా లోకేష్‌ వివరించారు. కాగా, 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేర్లతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు.చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అమిత్‌ షా.. నారా లోకేష్‌ ను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్‌‍తో అమిత్‌ షా చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు.

అరెస్ట్‌ వెనుక బీజేపీ లేదు అని చెప్పేందుకే...

రాష్ట్ర ప్రభుత్వం, అధికార నేతల పగబట్టి తీరును అమిత్‌ షాకు లోకేష్‌ వివరంగా వివరించారు. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్‌ వెనుక కేంద్రం ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసే వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్‌ షా.. లోకేష్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇస్తారూ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. భేటీ తర్వాత పురందేశ్వరి ట్వీట్‌ చేస్తూ రాష్ట్రంలో ఉన్న భయానక పరిస్థితులను లోకేష్‌ హోం మంత్రి అమిత్‌ షా వివరించారని,చంద్రబాబు అరెస్ట్‌ వెనుక బిజెపి ఉందని విమర్శిస్తున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని, బాబు అరెస్ణువెనక బిజెపి ఉంటే ఇప్పుడు లోకేష్కి ఎందుకు భేటీకి అవకాశం ఇస్తారంటూ ఆమె ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో అమిత్‌ షా వివరాలు కనుకున్నారని ఆయన తొందర్లోనే ఈ విషయంపై స్పందిస్తారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత ఎన్నికల సమయంలో తెలుగుదేశంపార్టీతో కంటే వైసీపీ తోనే కేంద్ర పెద్దలకు అవసరాలు ఎక్కువ ఉండటంతో ఈ విషయంలో అమిత్‌ షా ఏ మేరకు కల్పించుకుంటారు అన్నది కూడా అనుమానంగానే మారింది .ఎన్నికల చివరి దశలో ఉన్నందున బజాపా నాయకత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ రాజకీయ ప్రయోజనాల కేంద్రం గానే ఉంటాయని ప్రస్తుతం తెలుగుదేశం కన్నా వైసీపీ నే నమ్మ దగ్గ మిత్రుడు గా కేంద్రం పరిగణిస్తునందున కేవలం లోకేష్‌ తో బేటీ ఫార్మాలిటీ గానే జరిగింది తప్ప దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం టిడిపి కి ఉండదని వార్తలు వస్తున్నాయి .

వేడుకున్న  లోకేష్‌  ?

కేసుల పద్మవ్యూహంలో చిక్కుకున్న నారా ఫ్యామిలీని బయట పడేసేందుకు నారా లోకేష్‌ కేంద్ర హోంమంత్రి అమిషాతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. మీరు చెప్పినట్లు నడుచుకుంటాము...కేసుల నుండి బయటపడేయని వేడుకున్నట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలిపేందుకు సంసిద్ధంగా తెలియజేసినట్టుగా తెలిసింది. కానీ అమిషా నుండి ఎలాంటి గట్టి హామీ గానీ, భరోసా గానీ లభించలేదని తెలుస్తోంది. ఈ కలయిక పరిణామాలు ఎలా ఉంటాయో కొద్ది రోజుల్లోనే తేలనుంది. చూద్దాం...ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !