Narayana Family : ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ స్కామ్‌...FIRలో నారాయణ ఫ్యామిలీ మెంబర్స్‌ !

0

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితుల జాబితాలో చేర్చింది సిఐడీ. సోమవారం ఈ ఐదుగురు పేర్లను చేర్చుతూ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్‌ భార్య), ఆవుల మణి శంకర్‌( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్‌ కుమార్‌ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. క్రైం నంబర్‌ 16/2021 గా ఇప్పటికే ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసిన ఏపీ సీఐడీ. వారిపై ఐపీసీ 120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్‌ విత్‌ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. 

ఏపీ సీఐడీ మెమో దాఖలు

ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్‌, ఏ-18గా ప్రమీల, వరుణ్‌కుమార్‌ కొత్తాపును ఏ19గా చేర్చింది. ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేశారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు. కాగా.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అటు హైకోర్టు తీర్పును వెలువరించిందో లేదో.. ఇటు సీఐడీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో మరికొందరి పేర్లను యాడ్‌ చేస్తూ మరో పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !