ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ (BRS) షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ ( BRS LEADER NEELAM MADHU MUDIRAJ) బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (KCR) రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి (SANGAREDDY) జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడిరచారు.
పాదయాత్ర
కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా బీఆర్‌ఎస్‌లో ముదిరాజ్‌లకు సముచితం దక్కడంలేదని నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ప్రకటించే విషయంలో బీఆర్ ఎస్ పార్టీకి అక్టోబర్ 16 వరకు డెడ్ లైన్ విధించిన నీలం మధు.. పార్టీ నాయకత్వం స్పందించకపోతే పార్టీని వీడి, పటాన్ చెరు నుంచే ఎన్నికల బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. పటాన్ చెరులో అహంకారం కావాలా.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నరు నీలం మధు..బీఆర్ ఎస్ రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ప్రజల మనిషిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
బీఆర్‌ఎస్‌కు దూరం అవుతున్న సామాజిక వర్గాలు !
ఇప్పటికే చంద్రబాబు నాయుడు విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు స్పందనకు వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గంతో పాటు ఐటి ఉద్యోగులు బీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదని ఇటీవలే ముదిరాజ్‌ల సభ ద్వారా అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నీలం మధు కూడా పఠాన్‌చెరు సీటు ఇవ్వాలని కోరారు. కానీ బీఆర్‌ఎస్ పట్టించుకోకపోవటంతో ముదిరాజ్‌లు అందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ సామాజిక వర్గం కూడా దూరం అయితే బీఆర్‌ఎస్ గెలుపుకు దూరం అవుతన్నట్టే అని చెప్పవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.