PK Comments : సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలం

0

సంపద సృష్టించకపోతే.. డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారని రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్‌కిశోర్‌ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణాన్ని సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ‘‘సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే.. పంచడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితికి దారితీస్తుంది. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ‘అవతార్‌ లైవ్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించిన ‘షార్ప్‌ ఇన్‌సైట్స్‌ ఆన్‌ ఇండియా-2024’ కార్యక్రమం కోసం పాత్రికేయురాలు సోమా చౌదరి తాజాగా ప్రశాంత్‌కిశోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రశాంత్‌ కిషోర్‌ సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిందే అని స్పష్టం చేసారు. అదే సమయంలో సంపద సృష్టించి అందులో నుంచి కొంత పంపిణీ చేయాలన్నారు. సమాజంలో సంపద పెరిగే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని సూచించారు. అప్పుడే మన భావితరాలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.

సంక్షేమం - సంపద

వైసీపీతో సహా పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం బీహార్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. సంపద సృష్టించకపోతే..డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణం సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచటానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించలేకపోతే అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితి దారి తీస్తుందని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తేనే దాన్ని పంచగలమని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహరించారు. వ్యూహాలతో పాటుగా పథకాల ప్రకటన విషయంలోనూ సూచనలు సలహాలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయంగా వైసీపీకి దూరమయ్యారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే కోసం రాజకీయ వ్యూహకర్తగా పని చేసారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ మమతా, స్టాలిన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఒక రాజకీయ వ్యూహకర్తగా కొనసాగటం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు. పూర్తిగా బీహార్‌ రాజకీయాలకే ప్రస్తుతం ప్రశాంత్‌ కిశోర్‌ పరిమితం అయ్యారు. 

వైరల్‌ అవుతున్న వ్యాఖ్యలు

ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్‌ సర్కిల్స్‌లో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ..మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. సంక్షేమ ఓట్‌ బ్యాంక్‌ పైనే ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకుంటున్నాయి. ఈ సమయంలో సంక్షేమం - సృష్టి పైన ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !