Rahul Gandhi : దొరల తెలంగాణ కావాలా ? ప్రజల తెలంగాణ కావాలా ?

0

తెలంగాణ రాష్ట్రంలో దొరల తెలంగాణ నడుస్తోందని, ఇప్పుడు ప్రజల తెలంగాణ తీసుకొస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది.. ఆ హామీని కాంగ్రెస్‌ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని, కాంగ్రెస్‌ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది.

‘‘కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇచ్చారా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంత మందికి ఇచ్చారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.. ఎంత మందికి చేశారు? కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ మేం నెరవేర్చాం. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామన్నాం.. అమలు చేసి చూపాం. రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నాం. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం క్వింటాల్‌ రూ.2,500కు కొంటున్నాం. దేశంలోనే వరిధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ. కర్ణాటక వెళ్లి చూడండి.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు పడుతోంది. ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ తప్పకుండా నిలబెట్టుకుంటుంది’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే...

‘‘తెలంగాణలో బీజేపీ చిరునామా కోల్పోయింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయి. వాటితో ఎంఐఎం కూడా కలిసే ఉంది. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మిలాఖత్‌ అయ్యాయి. కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఏమీ ఉండవు.. ఇదే బీఆర్‌ఎస్‌, బీజేపీ మిలాఖత్‌కు నిదర్శనం. నన్ను కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించింది.. కానీ, కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. మీరు బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకు వేసినట్టే’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !