iPhone Hacking : మరోసారి విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్‌ కలకలం !

0

ప్రతిపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భగ్గుమనడంతో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్ని ఫోన్లు ట్యాపింగ్‌ చేయాలనుకుంటే అన్ని ఫోన్లు ట్యాప్‌ చేయండి.. నా ఫోన్‌ కూడా తీసుకోండి, భయపడేది లేదు..అని అన్నారు. దేశంలోని పలువురు విపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని, వారికి యాపిల్‌ సంస్థ నుంచి అలర్డ్‌ మెసేజ్‌లు కూడా వచ్చాయని ఆయన అన్నారు. దీనికి ముందు, పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఐ ఫోన్‌లను హ్యాక్‌ చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మెసేజ్‌లు అందుకున్న వారిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌, శివసేన నేత ప్రియాంక చతుర్వేది, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌కు చెందిన పవన్‌ ఖేరా ఉన్నారు. వీరంతా తమ ఐ ఫోన్‌లకు వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీసి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాలను ట్యాగ్‌ చేశారు.

మోదీ ఆత్మ అదానీలో...

కాగా, విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై రాహుల్‌ గాంధీ మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘’మీరు ఎన్ని ఫోన్లు హ్యాకింగ్‌ చేయాలని అనుకుంటారో అన్నీ చేయండి. నా ఫోన్‌ కూడా తీసుకోండి. నేను భయపడను. ఇది నేరగాళ్లు, దొంగలు చేసే పని. ఆయన తన ప్రసంగాన్ని ఒక కథతో ప్రారంభించారు.  ప్రస్తుత ప్రభుత్వ అధినేత దాచిన నిజం ప్రతిపక్షాలకు తెలిసిపోయిందని అన్నారు. ఫోన్‌ హ్యాకింగ్‌ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. విపక్ష నేతల ఫోన్లు హ్యాక్‌ అవుతున్నాయన్నారు. కానీ వాళ్లు భయపడరు.. ప్రభుత్వం నిఘా పెట్టాలి. తాము హ్యాకింగ్‌ గురించి పట్టించుకోం. దేశ ప్రజలు ప్రతి సత్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ట్యాప్‌ చేసినా కూడా ఎలాంటి తేడా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఎంతటి నష్టాన్ని చవిచూస్తోందో ఊహించలేం. నేడు తప్పుడు కలలు అమ్మబడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ ఆత్మ అదానీలో ఉందని అన్నారు. అధికారం ఎవరి చేతుల్లో ఉంది. వ్యవసాయ రంగం అదానీ చేతుల్లో ఉంది. మౌలిక సదుపాయాలు వారి చేతుల్లో ఉన్నాయి. దేశ ఆస్తులను అమ్మేస్తున్నారు. దేశ యువతకు నష్టం వాటిల్లుతోంది.

నడుస్తోంది అదానీ సర్కార్‌ ! 

అదానీ అంశాన్ని రాహుల్‌ ప్రస్తావిస్తూ, గతంలో ప్రధాని మోదీని నెంబర్‌ 1గా, అదానీని నెంబర్‌ 2గా, అమిత్‌షాను నెంబర్‌ 3గా తాను చెప్పేవాడినని, అయితే అది సరికాదని అన్నారు. అదానీ నెంబర్‌ 1, మోదీ నెంబర్‌ 2, అమిత్‌షా నెంబర్‌ 3 అని, అదానీ తప్పించుకోలేరని, డిస్ట్రాక్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ఇది ‘అదానీ సర్కార్‌’ అంటూ రాహుల్‌ అభివర్ణించారు. ‘’ఇది ఆసక్తికరమైన సమస్య. నాదగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. టైము వచ్చినప్పుడు అదానీ ప్రభుత్వాన్ని తొలగించి చూపిస్తాం. దేశంలో అదానీ మోనపలైజేషన్‌ నడుస్తోంది. బీజేపీ ఆర్థిక వ్యవస్థ ఆయనతో (అదానీ) నేరుగా ముడిపడి ఉంది’’ అని రాహుల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !