Revanth Reddy Profile : సిఎం రేసులో రేవంత్‌ సఫలమవుతారా ?

0


దూకుడు స్వభావంతో రాజకీయాలలో తనదైన బ్రాండ్‌ వేసుకున్న మాస్‌ లీడర్‌... చెప్పే మాటైనా.. చేసే పనైనా.. అదొక సంచలనానికి కేరాఫ్‌ అడ్రస్‌... విమర్శలైనా, నిరసనలైనా తనదైన మార్క్‌తో రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. అనుచరులేమో ఈయన్ని ముద్దుగా బాస్‌ అని పిలుచుకుంటుంటారు. 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పదునైన వ్యూహాలు రచిస్తున్నారు ఈ మాస్‌ లీడర్‌. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు అనుములు రేవంత్‌ రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఈయనకు చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. డిగ్రీ చదివే సమయంలోనే రేవంత్‌ రెడ్డి.. అఖిల భారత విద్యార్ధి పరిషత్‌ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న రేవంత్‌ రెడ్డి.. 1992లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి మేనకోడలు గీతను వివాహమాడారు.

రాజకీయ జీవితం ఇలా..

1992 సంవత్సరంలోనే విద్యార్థిగా ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డి.. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ నాయకుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. మొదటిలో టీడీపీ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ రెడ్డి.. 2001-02 మధ్యలో టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌)లో పని చేశారు. రేవంత్‌ తన రాజకీయ ప్రస్థానం ఆదిలోనే కొన్ని ఎత్తుపల్లాలను చూశారు. 2004లో కల్వకుర్తి టికెట్‌ వస్తుందని రేవంత్‌ ఆశించినా.. చివరికి ఆయనకు నిరాశే మిగిలింది. అలాగే 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తనకు టికెట్‌ వస్తుందని భావించినా.. అది కూడా అందని ద్రాక్షే అయింది. ఇక 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి.. అద్భుత విజయాన్ని అందుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ రెడ్డి పేరు విపరీతంగా మారుమ్రోగింది. 2008లో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి చేరిన రేవంత్‌ రెడ్డి.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై భారీ విజయం సాధించారు. ఆయన 2014లో కూడా మరోసారి గుర్నాథరెడ్డిని ఓడిరచి.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014`17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నారు.

కాంగ్రెస్‌లోకి ప్రయాణం...

రేవంత్‌ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్‌ 2021లో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

వివాదాలకు కూడా కేరాఫ్‌ అడ్రస్‌..

సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే టీపీసీసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. 2015లో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌లో రెడ్‌హ్యండెడ్‌గా దొరికిపోయారు. ఆ కేసులో జైలుకి వెళ్లి.. రెండు నెలల అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పట్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్‌ అయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !