రేవంత్ రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ పోటీ నుండి తప్పుకుంటుందా ? రేవంత్ రెడ్డిని సిఎంగా చూడటమే చంద్రబాబు కలా ? తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ గెలుపుకి లోపాయకారిగా సహాకరిస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ మనిషిగా చూడటం లేదు. తెలుగుదేశం మనిషిగానే చూస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్ ఉన్నరన్న అనుమానంతో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌కు మద్దతిస్తామని కొందరు టీడీపీ సానుభూతి పరులు ఓపెన్‌గానే మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు సహకరిస్తున్న టీడీపీ
ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరియు అభిమానుల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకు పోటీ నుండి విరమించారు అనే మాటే గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్` టిడీపీ ఒక్కటే అనే నిందను భవిష్యత్తులో చంద్రబాబు మోయవలసి ఉంటుంది. కాంగ్రెస్‌కు లోపాయకారిగా సహకరించటం ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి దగ్గర కావొచ్చు అనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగా జగన్‌తో పాటు బీజేపీని కార్నర్ చేయటం చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబును ఎన్ని రోజులు జైల్లో ఉంటే అంత సానుభూతి పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు మానసికంగా అందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాబుని...అన్యాయంగా జైల్లో వేశారు అన్న సానుభూతితో ఈసారి ఏపీలో క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు చంద్రబాబుకు మెండుగా ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచి కాంగ్రెస్‌గానీ లేదా యుపిఏ గానీ అధికారంలోకి వస్తే...చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు జగన్‌ను పాత కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేద