Telangana Congress : కాంగ్రెస్‌ రెండో జాబితా 25 న ప్రకటించే అవకాశం !

0

తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా అభ్యర్ధుల ప్రకటనపై.. స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజక వర్గాలకు ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో.. రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆచితూచి అడుగులు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దృష్టిసారించిన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేఫథ్యంలో మొదటి జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ.. రెండో జాబితాపై కసరత్తు ప్రారంభించింది. అభ్యర్ధుల ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ ఇవాళ దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో రెండో జాబితా తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ‘మిగిలిన 64 నియోజకవర్గాలకు ఒకేసారి ప్రకటిస్తాం’ మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజక వర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వామపక్షాల సీట్ల సర్థుబాటుపై పీఠముడి !

వామపక్షాలతో కాంగ్రెస్‌కు పొత్తులు కుదిరినా.. సీట్ల సర్దుబాటుపై పీట ముడి వీడలేదని తెలుస్తోంది. అయితే వరుసగా రెండో రోజు ఇవాళ కూడా సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్‌ కమిటీ చర్చించినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. వైరాకు బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్‌ ఫోకస్‌​పాలేరు ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు కాంగ్రెస్‌.. వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటుపై మరొకసారి రాష్ట్ర నాయకత్వం వామపక్షాలతో కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. కీలక నేతలందరూ అక్కడి నుంచే పోటీకి సుముఖం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. రెండో జాబితాలో అయినా తమ పేర్లు వచ్చేట్లు చూసుకునేందుకు నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరికలు కూడా ఊపందుకున్నాయి. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో బండి రమేష్‌, ఎమ్మెల్యే రేఖానాయక్‌, నారాయణ్‌రావు పటేల్‌ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌​రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పలు నియోజకవర్గాలకు బలమైన నాయకులు పార్టీకి దొరికినట్లు కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి టికెట్లు ఇవ్వడంపై స్క్రీనింగ్‌ కమిటీ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం.. సీనియారిటీకి పెద్ద పీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !