మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇప్పటికే దసరా సందర్బంగా బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ లియో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్నాయి. దీనితో వీరిద్దరికీ పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు.అయితే ఆ రెండు సినిమాలు రవితేజ సినిమా కంటే ముందు రోజు అనగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. 1980 దశకంలో తెలుగు రాష్ట్రాలను గడగడలాడిరచిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నుపుర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్ వంటి వారు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..
రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ బిజినెస్ !
అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 38 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి 18 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా, నైజాంలో తొమ్మిది కోట్లు వరకు టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే ఓవర్‌సీస్‌లో మూడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది. రవితేజ గత సినిమాలకు రెట్టింపు బిజినెస్‌ను ఈ సినిమా చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రావణాసుర 22 కోట్లు మరియు ధమాకా 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమా రికార్డులను టైగర్ నాగేశ్వరరావు క్రాస్ చేసింది.రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా టైగర్ నాగేశ్వరరావు నిలిచింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలిరోజు ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.