నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. మరోవైపు వ్యాఖ్యాతగా చేశారు.. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ షో చేశారు.. ఈ షోలో సినీ, రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. బాలయ్యను ఎప్పుడు కోపంగా చూసే జనాలకు ఈ షోలో కొత్త బాలయ్యను జనం చూశారు, దాంతో షోకు మంచి రేటింగ్ వచ్చింది.. భారీ సక్సెస్ ను అందుకోవడంతో రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు మూడో సీజన్ కోసం ఆహా ముహూర్తం ఫిక్స్ చేసింది. దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉండనున్నట్టు, మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి అన్‌స్టాపబుల్ సీజన్ 3 షోలో రానున్నట్టు కూడా ఆహా ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం షూటింగ్ జరిగింది. తాజాగా అధికారికంగా దసరా నుంచి ఈ సీజన్ ప్రారంభం కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించేసింది ఆహా. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కి భగవంత్ కేసరి టీం రాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్ దసరా ముందు అక్టోబర్ 17న ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. దీంతో బాలయ్య అభిమానులు ఆతృతగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, అనిల్ రావిపూడి గతంలో బ్రహ్మానందంతో కలిసి ఒకసారి అన్ స్టాపబుల్ లో పాల్గొని అలరించాడు. మొత్తంగా సీజన్ 3 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా గత రెండు సీజన్స్ ని మించేలా ఆహా వారు దీనిని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక సీజన్-3 ని తక్కువ ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎపిసోడ్స్ ఈ సీజన్ లో హైలెట్ అవ్వనున్నాయని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.