సోషల్ మీడియా సంస్థ ట్విటర్ ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ తన అధికారిక ట్విటర్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడిరచారు. ఈ ఫీచర్లను యాక్టివేషన్ చేసుకునేందుకు వీలుగా స్క్రీన్ షాట్ కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ‘ఎవ్రీథింగ్’ యాప్‌గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు ఎలాన్ మస్క్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ ఫీచర్ సాయంతో ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్స్ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలు ఈ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ ఫీచర్లను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే? ముందుగా ఎక్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి ఆ తర్వాత ూతీఱఙaషవ డ ూaటవ్‌వ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ణఱతీవష్ వీవంంaస్త్రవం ఆప్షన్‌ను ఎంచుకోవాలి జుఅaపశ్రీవ Aబసఱశీ డ పఱసవశీ జaశ్రీశ్రీఱఅస్త్ర ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023