తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ బీసీలను మోసం చేసిందన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీలు బీసీ ద్రోహులను ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ బీసీలకే అత్యధిక టికెట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత కూడా బీజేపీదేనని కొనియాడారు. బీజేపీకి అవకాశమిస్తే 5 ఏళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ప్రజలకు తెలిపారు అమిత్ షా. ఈ మేరకు గద్వాలలో జరిగిన విజయ సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ‘బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యం.
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది.
అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ రికార్డు సృష్టించారు. దళిత సీఎంను చేస్తానని చెప్పి మోసం చేశారు. మేము అధికారం చేపడితే బీసీని సీఎం చేస్తాం’ అని గద్వాల సభలో షా ప్రకటించారు.ఉద్యోగాల పేరిట సీఎం కేసీఆర్ యువతను మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. ‘టీఎస్‌పీఎస్‌సీ నుంచి 7 నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి, ప్రశ్నపత్రాలను లీక్ చేశారు. అలాంటి ఘటనల వల్ల ప్రవల్లిక, అహ్మద్ వంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు. అవి ప్రభుత్వం చేసిన హత్యలే అని అన్నారు. బీజేపీకి అవకాశమిస్తే 5 ఏళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా కల్పిస్తామని ప్రజలకు తెలిపారు అమిత్ షా. రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే జోగులాంబ మహా శక్తి పీఠాన్ని ప్రముఖ తీర్థస్థలంగా అభివృద్ధి చేసేందుకు రూ.80 కోట్లు కేటాయిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. బూటకపు హామీలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిందంటూ అమిత్ షా ధ్వజమెత్తారు.
Modi ji has announced that the next CM of Telangana would be from a backward class.
— BJP (@BJP4India) November 18, 2023
The BJP promises to provide you with the first Chief Minister belonging to a backward class.
- Shri @AmitShah #TelanganaWithBJP pic.twitter.com/pFfpsOrMfz