VVPAT : ఓటు వేస్తున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి.

0


నవంబర్‌ 30 వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత కీలకమైన రోజు. రాబోయే ఐదేళ్లు మనల్ని ఎవరు పాలించాలో మనం నిర్ణయించుకునే రోజు. కాబట్టి ప్రతి ఓటరు కొంచం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటంఉది. మనం వేసే ఓటు సరిగ్గా పడిరదో లేదో, వెయ్యాలనుకున్న అభ్యర్థికి వేశామో లేదో మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ఇందుకోసం వివి ప్యాట్‌ (ఓటర్‌ వెరిఫెయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రం ఉంటుందని మనకు తెలుసు. మనం ఓటు వేశాక.. అందులో ఎవరికి ఓటు వేసిందీ స్లిప్‌ చూపిస్తుంది కదా. ఐతే.. ఈ స్లిప్‌ ఎక్కువ సేపు కనిపించదు. జస్ట్‌ 7 సెకండ్లే కనిపిస్తుంది. ఆ తక్కువ టైమ్‌ లోనే మనం చూసేసుకోవాలి.

స్లిప్‌లో ఏం చూపిస్తుంది?

మనం ఓటు వెయ్యగానే కుయ్‌ మని బీప్‌ శబ్దం వస్తుంది. అది రాగానే.. మనం వెంటనే పక్కనే ఉన్న వీవీ ప్యాట్‌ వైపు చూడాలి. అందులో స్లిప్‌ సర్రున వచ్చి కనిపిస్తుంది. 7 సెకండ్ల తర్వాత అది కింద ఉన్న డ్రాప్‌ బాక్స్‌లో పడిపోతుంది. ఆ స్లిప్‌ ని మనం తీసుకునే వీలు ఉండదు. కాబట్టి.. అక్కడే చూసుకోవాలి. ఈ స్లిప్‌లో అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తు చూపిస్తుంది. ఓటు వేసే గదిలో లైటింగ్‌ బాగా ఉండాలి. అప్పుడే మనకు ఈ స్లిప్‌ బాగా కనిపిస్తుంది.

స్లిప్‌ ఎందుకు? 

మనం వేసిన ఓటు పడిరదో, లేదో అనే డౌట్‌ మనకు ఉంటుంది. ఇదివరకు తమ ఓటు పడలేదనీ, తమ బదులు వేసేవారు వేసేసి ఉంటారని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. దాంతో.. 2013 నుంచి ఈ వీవీ ప్యాట్‌లను రంగంలో దింపారు. వీటి వల్ల.. ఓటు పడిరది అనే క్లారిటీ వస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !