Bhatti Vikramarka : తెలంగాణకు కాబోయే తొలి దళిత ముఖ్యమంత్రి ?

0

తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడినే సిఎం చేస్తా అని మాట తప్పిన కేసీఆర్‌...లాగా కాకుండా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే దళితుడినే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు మొదటి ఛాయిస్‌ కూడా భట్టి విక్రమార్కే అని దిల్లీలో బలంగా వినిపిస్తోంది. రాజకీయ అనైక్యత కారణంగా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్‌ మొదటి ఛాయిస్‌ భట్టినే. ఆ తర్వాతే రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి. బలమైన దళిత నేతగా గుర్తింపుతో పాటు,  సౌమ్యుడు అని పేరుంది. అన్నింటినీ మించి కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడుగా భట్టి విక్రమార్క మసులకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు ముందు ఉన్నా కాంగ్రెస్‌ పార్టీని వదల్లేదు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో ముఖ్యమంత్రులైన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సన్నిహితుడిగా భట్టికి పేరుండేది. ఈ సాన్నిహిత్యం వల్లనే ఆయన కాంగ్రెస్‌ హయాంలో 2009-11 మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చీఫ్‌ విప్‌గా, 2011-14 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌ వంటి కీలక పదవులను కూడా చేపట్టారు. వైఎస్సార్‌ని రాజకీయ గురువుగా భావించే భట్టి విక్రమార్క.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం..

కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.. 2007-09 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో చీఫ్‌ విప్‌గా, 2011 జూన్‌ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై సేవలు అందించారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా మరోసారి అదే స్థానం నుంచి పోటీ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేతగా కూడా భట్టి విక్రమార్క ఎన్నికైన విషయం తెలిసిందే. ఆప్పటి నుంచి కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న భట్టి విక్రమార్క.. పార్టీలో బలమైన దళిత నేత. 

పాదయాత్ర కలిసొచ్చేనా ?

2023 మార్చి 16న ఆదిలాబాద్‌​ జిల్లాలోని బోథ్‌ నుంచి ‘పీపుల్స్‌​ మార్చ్‌’ పేరిట​పాదయాత్ర ప్రారంభించి.. రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలోమీటర్లు పూర్తి చేశారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తన పాదయాత్ర ముగింపులో భాగంగా 2023 జులై 2న రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా జన గర్జన సభను నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !