ఎట్టకేలకు టీబీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 35 మంది అభ్యర్థులతోపాటు పొత్తులో భాగంగా జనసేనకు 9 సీట్లను కేటాయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ నేతలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ కోర్ కమిటీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, ప్రకాశ్ జవడేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలోనే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఢల్లీిలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయ తీసుకున్నారు. జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కమిటీ నేతలు పాల్గొన్నారు. బుధవారం అర్థరాత్రి వరకు జరిగిన ఈ భేటీలో తొలుత రాజస్థాన్‌లో మిగిలిన 76 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. వాటిలో 70 స్థానాలకు అభ్యర్థులను కమిటీ ఖరారు చేసింది. మిగతా 6 స్థానాలను పెండిరగులో పెట్టిన కమిటీ, వాటికి అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాకే వదిలేసింది. తర్వాత తెలంగాణపై బీజేపీ సీఈసీ సమావేశమైంది. తెలంగాణలో మిగిలిన 66 స్థానాలపై చర్చించారు. జనసేనకు పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలన్న విషయంపై కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది. జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు అధినాయకత్వం అంగీకారం తెలిపింది.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided the names for the ensuing General Elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/gBiItOpDJC
— BJP (@BJP4India) November 2, 2023