Samantha : సమస్యలతో మానసికంగా కుంగిపోయా !

0


టాలీవుడ్‌​ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి.. పూర్తి సమయాన్ని ఆరోగ్య సంరక్షణకు కేటాయించారు. సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇచ్చిన ఆమె.. తన టైమ్‌​ను రిలాక్సేషన్‌​తో పాటు మయోసైటిస్‌​ ట్రీట్‌​మెంట్‌​ కోసం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడం వల్ల తాను ఎంతో కుంగిపోయినట్లు అందులో పేర్కొన్నారు.

కుంగిపోయా

ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా బీటలు వారింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలు కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో నేను ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోల్స్‌​ను ఎలా తట్టుకున్నారన్న విషయాలను తెలుసుకున్నాను. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడిరది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం నాకు వచ్చింది. అదే నాకు బలాన్ని ఇచ్చింది’’ అని సమంత తెలిపారు. మరోవైపు తన సినిమాలతో పాటు తన కెరీర్‌​ గురించి మాట్లాడారు. ఓ నటిగా ఇంతమందిలో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సమంత అన్నారు.

నటిగా గుర్తింపు 

ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అందమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నాను’’ అని సమంత భావోద్వేగానికి లోనయ్యారు.

భూటాన్‌​లో ట్రీట్‌​మెంట్‌​..

మరోవైపు సమంత తాజాగా భూటాన్‌​కు పయనమయ్యారు. గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్‌​కు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తున్న సామ్‌​.. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకున్నారు. దీంతో పాటు డాట్‌షో (హాట్‌ స్టోన్‌ బాత్‌) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌​స్టా వేదికగా ఫ్యాన్స్‌​తో పంచుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !