T Election : ఓటుకి నోట్లు రెడీ చేస్తున్న నేతలు !

0

ఎన్నికలకు చివరి రెండు రోజులే అత్యంత కీలకం. ఎవరూ ఎంత ప్రచారం చేసినా..పోలింగ్‌కి ఒకటి రెండు రోజుల ముందు ఓటర్లకు మనీ, మద్యం ఎవరూ ఎక్కువగా పంచుతారో వారే గెలుస్తారనే భావన ఉంది. అందువల్ల నల్లధనం పోగేసిన నేతలు.. ఆ డబ్బును పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నాయకులు, వారి అనుకూలవర్గం నాయకులు  పోల్‌ మేనేజ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సరైన పద్ధతిలో, అందరూ ఓట్లు వేసేలా చెయ్యడం. ఇది మంచిది. రెండోది దొంగది. ఈ పద్ధతిలో అక్రమంగా ఓట్లు వేయించడం, డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ, అభ్యర్థులూ భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. చాలా మంది బ్లాక్‌ మనీని కట్టలు కట్టలుగా దాచి ఉంచారనీ, దాన్ని ఇప్పుడు బయటకు తీస్తారని తెలిసింది. నిజానికి పోలీసులు.. నెల నుంచి జరుపుతున్న తనిఖీల్లో రూ.700 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, వజ్రాలు, డ్రగ్స్‌, మద్యం, ఇతరత్రా వాటిని సీజ్‌ చేశారు. కానీ.. అదంతా చాలా తక్కువ అనీ.. అసలైన పంపకాలన్నీ ఇవాళ, రేపూ జరుగుతాయని అంటున్నారు.

వీడు ఇవ్వడు...ఇచ్చే వాళ్ళకు ఇవ్వనివ్వటం లేదు.

ప్రస్తుతం ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉంది. ఈ రెండు పార్టీలూ బలమైన అభ్యర్థులను బరిలో దింపాయి. అయినప్పటికీ.. చాలా మంది అభ్యర్థులు డబ్బులు పంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈసారి ఓటుకు రూ.5వేల దాకా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని టాక్‌ ఉంది. ఆల్రెడీ కొన్నిచోట్ల ఇప్పటికే నిన్నటి నుండే పంపకాలు షురూ చేశారట. ఎల్‌.బి.నగర్‌లో ఓ ప్రధాన అభ్యర్థి ఓటుకి రూ. 2000/- పంపిణీ చేస్తుండగా, ఉప్పల్‌ నియోజకవర్గంలోనూ ఓటుకు రూ. 2000/` పంపిణీ జరగుతోంది. ప్రక్కనే ఉన్న మేడ్చల్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ. 1000/- పంచుతున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో డబ్బు పంపిణీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులను ప్రతిపక్ష పార్టీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించటం జరిగింది. ఈ సంఘటన ఓటర్లలో ఓ ఆసక్తికర చర్చకు తెరతీసింది. వీడు ఇవ్వడు...ఇచ్చే వాళ్ళకు ఇవ్వనివ్వటం లేదు. ఇలాంటి వాడికి ఓటు ఎందుకు వేయాలి అంటూ కొందరు మాట్లాడుకోవటం కనిపించింది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఓటర్లలో నిరాసక్తత కనిపిస్తోంది. నాయకులు అలవాటు చేసి, ఇప్పుడు ఇవ్వక పోవటం ఒక రకంగా ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. ప్రధాన పార్టీకి చెందిన అనుచరులు వార్డుల వారీగా ఇంటి నెంబర్ల వారీగా గడపగడపకు తిరిగి ఓటర్ల లిస్ట్‌ వారాగీ డబ్బు పంపకాలు చేస్తున్నారు.

మద్యం కూడా

డబ్బుతోపాటూ మద్యం కూడా పంచడానికి రెడీ అయ్యారట. జిల్లాల్లో కూడా భారీగా మద్యం నిల్వలను దాచారని టాక్‌ వస్తోంది. ఐతే పోలీసులు కూడా రెడీగానే ఉన్నారు. ఈ రెండ్రోజుల్లో తనిఖీలను భారీగా చెయ్యాలని ప్రిపేర్‌ అవుతున్నారు. కాబట్టి.. భారీగా సీజ్‌ చేసే అవకాశాలూ ఉంటాయి. ఎన్నికలంటే మనీ, మద్యంతోనే పని అనే పరిస్థితి వచ్చేసింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !