ఇంటరాక్టివ్ చాట్‌బాట్ (Chatbot) చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) ఓపెన్‌ఏఐ (OpenAI) షాకిచ్చింది. శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో (CEO) బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్‌ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ (Mira Murati) సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.‘‘ఆల్ట్‌మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదు. సరైన సమాచారం పంచుకోవడం లేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడు. ఓపెన్‌ఏఐ (%ూజూవఅAI%)కి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదు’’అని ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంపై ఆల్ట్‌మన్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘‘ఓపెన్‌ఏఐ సంస్థలో పనిచేయడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి, ప్రపంచాన్ని కొంచెం మారిందనడానికి నేను నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులైన వారితో పనిచేయడాన్ని ఇష్టపడ్డాను’’ అని పేర్కొన్నారు.
వైదొలిగిన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు..
కాగా.. శామ్ ఆల్టమన్‌ను సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) తన పదవికి రాజీనామా చేశారు. శామ్ ఆల్టమన్‌ను తొలగించిన కారణంగానే గ్రెగ్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడిరచారు. ‘‘గత ఎనిమిదేళ్ల నుంచి మేమంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల నేను గర్వంగా ఉన్నా. మేము ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నాం. గొప్ప క్షణాలను ఆస్వాదించాం. అసాధ్యమున్న ఎన్నో వాటిని సాధించి చూపించాం. కానీ, ఈ రోజు చూసిన వార్తతో నేను కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నా’’ అని గ్రెగ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (Artificial Intelligence) పనిచేసే చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆర్థిక మద్దతు కలిగిన ఓపెన్‌ఏఐ 2015లో అభివృద్ధి చేసింది. స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌తో (Elon Musk) కలిసి శామ్ ఆల్ట్‌మెన్ దీనిని రూపొందించారు. అయితే 2018లో ఈ కంపెనీ నుంచి మస్క్ తప్పుకున్నారు. కృత్రిమ మేధతో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే చాట్‌జీపీటీ అనూహ్య విజయం టెక్ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీపై హాట్ డిబేట్‌కు తెరలేపింది. లాంఛ్ అయిన రెండునెలల్లోనే చాట్‌జీపీటీ 10 కోట్ల యూజర్లను చేరుకుంది. ఏఐ ట్రెండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు టెక్ కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్స్‌ను డెవపల్ చేసేందుకు బారులుతీరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీని ఇటీవల కాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఈ చాట్‌బోట్ సహాయంతో కేవలం సెకన్లలోనే మనకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. చాట్‌జీపీటీ ఉపయోగాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతే సంఖ్యలో నష్టాలు సైతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయని తెలిపారు. ఆల్ట్‌మన్ సైతం ఏఐతో పెనుప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ కన్నా పవర్‌ఫుల్ ఏఐని డెవలప్ చేయగల సత్తా ఓపెన్‌ఏఐకి ఉన్నా.. ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని గతంలో ఆయన అన్నారు. యూజర్లు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని గతంలో ఆల్ట్‌మన్ చెప్పారు. ఇక ఓపెన్‌ఏఐ సంస్థకు వెన్నెముకగా ఉన్న మైక్రోసాఫ్ట్ బిలియన్లలో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం దీన్ని తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో వాడుతున్నారు.
i loved my time at openai. it was transformative for me personally, and hopefully the world a little bit. most of all i loved working with such talented people.
— Sam Altman (@sama) November 17, 2023
will have more to say about what’s next later.
🫡