CM KCR : కేసీఆర్‌ రాజశ్యామల యాగం ! మళ్ళీ తెస్తుందా యోగం !

0

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ముందు నుంచి కొంచెం దైవ భక్తి ఎక్కువే. దైవంపై పూర్తి విశ్వాసం ఉండటంతో పాటు యాగాలపై కూడా మంచి నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలంటూ.. 2015లో చండీయాగం నిర్వహించారు. అనంతరం.. 2018 రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. రెండో సారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో గులాబీ బాస్‌.. యాగాన్ని తలపెట్టారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవయసాయ క్షేత్రంలో నేటి (నవంబర్‌ 1) నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. రాజశ్యామలా అమ్మవారు, చండీ అమ్మవార్లతోపాటు ఐదుగురిని ఆవాహనం చేసుకొని హోమం నిర్వహించనున్నారు. ఈ రోజు సంకల్పంతో యాగం ప్రారంభం కానుంది. రెండో రోజు వేద పారాయణాలు , హోమం చివరి రోజు పుర్ణాహుతితో యాగం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో రాజశ్యామల, శత చండీ యాగాలను నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు యాగంలో పాల్గొననున్నారు. 200 మంది వైదికులు మంగళవారం సాయంత్రానికి ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ సతీమణితో కలిసి మంగళవారం (అక్టోబరు 31న) రాత్రి ఎర్రవల్లికి చేరుకున్నారు.

యాగం చేసిన ప్రతిసారీ విజయం అందుకున్న కేసీఆర్‌

పూర్వ కాలంలో రాజు గారు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు వెల్లడిరచారు. తొమ్మిది హోమ కుండాలు, వంద మంది రుత్వికులతో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజున సీఎం కేసీఆర్‌ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేస్తారు. రుత్వికులు పారాయణం, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. మూడో రోజున పూర్ణాహుతి కార్యక్రమాల్లో కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. అలాగే, శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో బుధవారం నుంచే వ్యవసాయ క్షేత్రంలో శత చండీ యాగం నిర్వహించనున్నారు.  2018 ఎన్నికల సమయంలోనూ ఈ యాగం చేసిన కేసీఆర్‌ అధికారం నిలబెట్టుకున్నారు. ఏపీలోనూ 2019 ఎన్నికల సమయంలో జగన్‌ ఈ యాగం నిర్వహించారు. అధికారం దక్కించుకున్నారు. ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలోనూ ఢల్లీిలో యాగం నిర్వహించారు. కేసీఆర్‌ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈసారి కూడా రాజ శ్యామల యాగం ద్వారా మూడోసారి అధికారం చేజిక్కించుకుంటారని పార్టీ వర్గాల విశ్వాసం.

విజయం పై ధీమా

విజయం ఆకాంక్షిస్తూ చేసే ఈ యాగం ఇద్దరు సీఎంలకు సెంటిమెంట్‌ గా మారింది. ఇప్పుడు ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలనేది కేసీఆర్‌ లక్ష్యం. మొదటి రెండు రోజులు వందమంది రుత్వికులచే పారాయ ణం నిర్వహిస్తారు. మూడో రోజు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ మేరకు రెండు యాగాల నిర్వహణకు సీఎం వ్యవసాయ క్షేత్రంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. యాగశాల, హోమ కుండాలను నిర్మించారు. హోమాల నిర్వహణ కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది రుత్వికులు చేరుకున్నారు. ఇప్పటికే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్‌ ఈ యాగం నిర్వహిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !