ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీల పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బంగారు లక్ష్మణ్ తమ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. ఆయన కింద గతంలో తాను పని చేశానని గుర్తు చేసుకున్నారు. బంగారు లక్ష్మణ్ నుంచి ఎంతో నేర్చుకున్నానన్న పీఎం.. ఆయనను గురువుగా భావిస్తానన్నారు. ఈ క్రమంలోనే మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను మాదిగలతో కలిసి పని చేస్తానని వెల్లడిరచారు. 30 ఏళ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడని కొనియాడారు. మందకృష్ణ తల్లిదండ్రులు ధన్యులని అభివర్ణించారు. ఇంతకాలం పాటు అహింసా మార్గంలో పోరాడటం గొప్ప విషయమన్న మోదీ.. మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదిగ విరోధులు - మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా’ మాదిగల పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎస్సీల హక్కుల సాధనలో తమ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. త్వరలోనే కమిటీ వేసి.. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన.. మందకృష్ణ మాదిగ పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు. కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఓదార్చారు.
𝐀𝐧 𝐞𝐦𝐩𝐚𝐭𝐡𝐞𝐭𝐢𝐜 𝐥𝐞𝐚𝐝𝐞𝐫!
— BJP (@BJP4India) November 11, 2023
PM Modi comforts Madiga Reservation Porata Samiti Chief, Manda Krishna Madiga, who got emotional during a public rally in Secunderabad, Telangana pic.twitter.com/iZUiBPUXHO
ప్రతిపక్షాలపై నిప్పులు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కలిసి దిల్లీ ఆప్ ప్రభుత్వంతో కలిసి అవినీతిలో భాగస్వాములయ్యారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అధికారం కోసం పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ మాత్రము సేవా కోసమే పోటీ చేస్తున్నాము. పేదలు అణగారిన వర్గాల కోసమే బీజేపీ ప్రభుత్వమే పనిచేసిందన్నారు. ఇంట్లో టాయిలెట్‌తో పాటు అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాము. గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము. బ్యాంక్ లోనులు తెచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ పథకాల వల్ల ఎక్కువ లాభ పడిరది దళితులు.. ఓబీసీ వర్గాలు మాత్రమే అన్నారు. ముద్ర లోన్ ద్వారా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు మాత్రమే ఎక్కువ లాభ పడ్డారు. ఇక కొన్ని నెలల క్రితమే ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ద్వారా రూ. 13 వేల కోట్లను 18 చేతి వృత్తులైన కమ్మరి, కుమ్మరి, మంగళి, చెప్పులు కుట్టే వారు నిర్లక్ష్యానికి గురైన ఓబీసీ, దళితుల కోసమే ఈ పథకం ప్రవేశి పెట్టిందన్నారు. లక్షల మంది పేదలు ఎవరు ఆకలితో బాధ పడకూడదనే ఉద్దేశ్యంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని దాదాపు 80 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ 2028 వరకు ఇవ్వనున్నట్టు చెప్పారు. 20 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాలను తెలంగాణ రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు చెప్పారు. రైతుల అంగగా వరి ధాన్యం మద్ధతు ధర పెంచామన్నారు. సాధారణంగా అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఢల్లీిలోని ఆప్ ప్రభుత్వంతో అవినీతి విషయంలో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. ఇలా అవినీతి కోసం ప్రభుత్వాలు కలిసి పని చేయడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు. ఢల్లీిలో కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద మద్దతుదారు అని తెలిపారు. అలాంటి ఆప్ తో కలిసి బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడుతోందన్నారు.