BC Declaration : కాంగ్రెస్‌ మరో అస్త్రం...బీసీ డిక్లరేషన్‌ !

0

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్సస్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి వేదికగా కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాల వ్యవధిలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. తెంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేసారు. డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ పలు ఆసక్తికర నిర్ణయాలను ప్రకటించింది. కామారెడ్డిలో రేవంత్‌ నామినేషన్‌ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్‌, నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. అక్కడే కాంగ్రెస్‌ పార్టీ బిసి డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలని నిర్ణయించిందని సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేన్లు 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై పోటీ చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి మరో చోట కూడా పోటీ చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారని వెల్లడిరచారు. రెండు చోట్లా రేవంత్‌ రెడ్డి, కెసిఆర్‌ పై భారీ మెజారిటీతో రేవంత్‌ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

బీసీ డిక్లరేషన్‌ 

సిఎం కెసిఆర్‌ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కెసిఆర్‌ ను ఓడిరచాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఓటుతో కెసిఆర్‌ ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌ లో కాంగ్రెస్‌ 50 ఏళ్లు దాటిన పద్మశాలీలకు పెన్షన్‌ తో పాటు విశ్వకర్మల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని తెలిపింది. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని పేర్కొంది. బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల లోన్‌, బీసీ సబ్‌ ప్లాన్‌, ప్రతి జిల్లాలో బీసీ భవన్‌, ప్రతి మండలంలో ఓ బీసీ గురుకులం ఏర్పాటు పైన హామీ ఇచ్చింది. మహాత్మ జ్యోతిబా పూలే సబ్‌ ప్లాన్‌ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్లు విడుదల చేయటంతో పాటుగా విశ్వకర్మలు, మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులుమంజూరు చేస్తామని ప్రకటించింది. గద్వాల్‌, సిరిసిల్ల, నారాయణ్‌ ఖేడ్‌ లో పవర్‌ లూమ్స్‌ ఏర్పాటు, రజకుల కోసం రూ.10 లక్షల సబ్సిడీ రుణాల పైన ప్రకటన చేసింది. వైన్స్‌ షాపుల టెండర్లలో గౌడ్స్‌ రిజర్వేషన్‌ మరింత పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం బీసీ-డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ లోకి చేరుస్తామని కాంగ్రెస్‌ సంచలన హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ కు ఆదరణ పెరిగిందని..అధికారం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌ కర్ణాటక రావాలి ! 

కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రచారానికి ప్రధాని మోదీ 48 సార్లు వచ్చారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అప్పుడు మోదీ ఎక్కడ ప్రచారం చేశారో.. అక్కడే కాంగ్రెస్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికలో మోదీని నమ్ముకున్న కర్ణాటక బీజేపీ నేతలు.. ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు.. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ చాలా అవకాశాలు ఇచ్చిందని నొక్కి చెప్పారు. కానీ బీఆర్‌ఎస్‌, బీజేపీ.. బీసీలకు, ఎస్సీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికలో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేమని బీజేపీ ఆరోపించింది.. కానీ వారం రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి చూపించామని అన్నారు. అలాగే కేసీఆర్‌ సైతం ఇదే మాట అంటున్నారు.. ఒకసారి వచ్చి అక్కడ ఎలా ఉందో చూసి వెళ్లండని సీఎం సిద్ధరామయ్య సూచించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !