TS Elections : మీ పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ? ఇలా తెలుసుకోండి.

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేశాయి. అడ్రస్‌ మారడం వల్లో, ఇతర కారణాల వల్లో కొందరికి పోలింగ్‌ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్‌ మీ చేతిలో ఉంటే సులువుగా మీ పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. 

  • మీ దగ్గర ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఆ నంబర్‌ను 1950, 92117 28082 నంబర్లకు పంపిస్తే మీ పోలింగ్‌ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో మీకు లభిస్తాయి.
  • 24 గంటల పాటూ పనిచేసే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఎన్నికల సంఘానికి చెందిన ‘ఓటరు హెల్ప్‌లైన్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా వివరాలు పొందొచ్చు.
  • ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌  www. ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in    ద్వారా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
  • www.ceotelangana.nic.in లోని Ask Voter Sahaya Mithra చాట్‌బాట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఓటరు వివరాలు, EPIC నంబర్‌ లేదా ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కూడా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.

ఓటు కేంద్రానికి ఏ ఏ గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి?

ఫొటో ఓటరు స్లిప్పు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌), ఆధార్‌ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జారీ చేసిన జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వీటిల్లో ఏదైనా గుర్తింపు పత్రంగా చూపించొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !