Skill Case : స్కిల్‌ కేసులో వాదనలు పూర్తి...తీర్పు రిజర్వ్‌

0

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బుధవారమే ఆయన వాదనలు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో హైకోర్టు విచారణ ఈ రోజుకి వాయిదా పడిరది. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్‌​ చేశారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారు. బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. సీమెన్స్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అంతా వెరిఫై చేయలేదని రాశారు. ఈ ఫోరెన్సిక్‌ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేయలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన వారే రిపోర్టులో చెప్పారు’’ అని లూథ్రా వాదించారు. ఈ కేసులో ముందుగా చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అనారోగ్య కారణాల కారణంగా హైకోర్టు అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన విచారణలో సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ మధ్యంతర బెయిలు పిటిషన్‌తో పాటు ప్రధాన బెయిలు పిటిషన్‌పై చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు.

అనారోగ్య కారణాలు చూపుతూ వాదనలు

హైకోర్టులో బుధవారం చంద్రబాబు తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన తప్పనిసరిగా మందులు వాడాలని వైద్యులు చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. ఐదు వారాల కంటి చెకప్‌ కోసం వైద్యులు షెడ్యూల్‌ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కోర్టుకు విన్నవించారు. గుండె పరిమాణం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని అన్నారు. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. స్కిల్‌ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌​పై దీపావళి తర్వాత తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు గతంలో తెలిపింది. ఈ కేసులో వాదనలు పూర్తి కావడంతో తీర్పును సుప్రీం రిజర్వ్‌ చేసింది. చంద్రబాబుపై నమోదైన కేసులకు సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందా లేదా అనేదానిపై ఈ తీర్పు కీలకంగా మారబోతోంది. సుప్రీంకోర్టు క్వాష్‌ పిటిషన్‌​ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభించనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !