Fire Accident : నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం...ఏడుగురు మృతి !

0

హైదరాబాద్‌ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందుతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రాకాశి మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాధమికంగా గుర్తించారు. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్‌ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక్కడి పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. కమర్షియల్‌ కం రెసిడెన్సియల్‌ బిల్డింగ్‌గా గుర్తించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కార్‌ గ్యారేజ్‌ వద్ద ఉన్న డీజిల్‌ డ్రమ్ములు పేలి భారీగా మంటలకు కారణం అయింది. సర్వీసింగ్‌కి వచ్చిన కార్లలోని డీజిల్‌ను డ్రమ్ముల్లో నిలువ ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలో జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారస్థితిలో ఉన్నారని.. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 

కెమికల్‌ డ్రమ్ముల కారణంగా పైఅంతస్తులకు మంటలు: 

డీసీపీగ్రౌండ్‌ ఫ్లోర్లో కంటే కూడా రెసిడెన్సియల్‌ ప్లేస్‌లో మంటలు క్షణాల వ్యవధిలో వ్యాపించినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడిరచారు. మొదటి అంతస్తులో కొన్ని కుటుంబాలు చిన్న పిల్లలతో నివాసముంటున్నారు. వీరికి ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఇద్దరికి గాయాలు కాగా..ఆరుగురు మరణించినట్లు ప్రాధమికంగా గుర్తించారు.  మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని లోనికి పంపించి మొదటి అంతస్తులోని కొందరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మంటలు అదుపులోకి వస్తే పరిస్థితిని అంచనా వేసేందుకు అవకాశం ఉండంటున్నారు లోకల్‌ డీసీపీ. బిల్డింగ్‌ పర్మిషన్లపై కూడా ఓనర్లను సంప్రదించి చర్యలు చేపడతామంటున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !