Thrisha - Mansur Issue : త్రిషకు సారీ చెప్పను....మన్సూర్‌ కౌంటర్‌ !

0

సార్ట్‌ హీరోయిన్‌ త్రిషను ఉద్దేశించి లియో సినిమాలో నటించిన మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మన్సూర్‌ సారీ చెప్పాలని నడిగర్‌ సంఘం డిమాండ్‌ చేస్తుండగా.. తాను క్షమాపణలు చెప్పేది లేదని ఆయన తెగేసి చెబుతున్నారు.

అసలు వివాదం ఏంటంటే..?

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మన్సూర్‌ అలీఖాన్‌ కూడా నటించారు. ఈయన తమిళ సినిమాల్లో రేప్‌ సీన్లు, విలన్‌ వేషాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇటీవల మన్సూర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘లియో సినిమాలో త్రిష, తాను నటిస్తున్నామని తెలిశాక.. త్రిషను తన చేతులతో ఎత్తుకుని బెడ్రూంకి తీసుకెళ్లే సీన్‌ ఉంటుందని, రేప్‌ చేసే సీన్‌ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ కనీసం త్రిష ముఖాన్ని కూడా నాకు చూపించలేదు’’ అంటూ మాట్లాడారు. మన్సూర్‌ అలీఖాన్‌చేసిన వ్యాఖ్యలపై త్రిష మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తితో జీవితంలో ఇంకెప్పుడూ కలిసి నటించనని ఆమె తెగేసి చెప్పారు. ఇలాంటి వారు మానవజాతికి చెడ్డ పేరు తీసుకొస్తారంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. మాళవిక మోహన్‌, ఖుష్బూ, రోజా, లోకేష్‌ కనగరాజ్‌ తదితర సినీ నటులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండిరచారు. ఖుష్బూ అయితే ఏకంగా మహిళా కమిషన్‌తో కేసు కూడా నమోదు చేయించారు. టాలీవుడ్‌ నుంచి హీరో నితిన్‌ త్రిషకు మద్దతుగా నిలిచారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సైతం స్పందించారు. త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్‌ ఖండిరచారు. అతడి వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్‌లకే కాకుండా స్త్రీలందరికీ అసహ్యం కలిగించేలా ఉన్నాయన్న చిరంజీవి.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఈ వ్యవహారంలో త్రిషకు తన మద్దతు ప్రకటించారు. ప్రతి మహిళా ఇలాంటి వ్యాఖ్యలను ఖండిరచాలన్నారు.

నడిగర్‌ సంఘం నిషేధం..

తమిళ, తెలుగు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలుస్తూ మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నడిగర్‌ సంఘం మన్సూర్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. అయినా సరే తాను త్రిషకు క్షమాపణలు చెప్పబోనని మన్సూర్‌ స్పష్టం చేయడం గమనార్హం. తనపై నిషేధం విధించడం ద్వారా నడిగర్‌ సంఘం మిస్టేక్‌ చేసిందన్న మన్సూర్‌.. తన నుంచి వివరణ కోరితే బాగుండేదన్నారు. అంతే కాదు తనపై నిషేధం విధిస్తూ జారీ చేసిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికే నడిగర్‌ సంఘానికి మన్సూరే కొంత టైం ఇచ్చారు. నేను మీకు క్షమాపణలు చెప్పేవాడిలా కనిపిస్తున్నానా..? మీడియా నాకు వ్యతిరేకంగా నచ్చినట్టు రాసుకోవచ్చు. జనాలకు నేనేంటో తెలుసు. నాకు తమిళ ప్రజల మద్దతు ఉందని మన్సూర్‌ వ్యాఖ్యానించారు. ‘సినిమాల్లో రేప్‌ సీన్‌ అంటే నిజంగా రేప్‌ చేస్తారా..? సినిమాల్లో మర్డర్‌ సీన్‌ అంటే నిజంగా మర్డర్‌ చేస్తారా? కొంచెమైనా బుద్దుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పేదీ లేద’ని మన్సూర్‌ కుండబద్దలు కొట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !