IT Raids On Ponguleti : పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు !

0

చెప్పిందే జరుగుతోంది, కాంగ్రెస్‌ నేతలే టార్గెట్‌గా ఐటి రైడ్స్‌ జరుగుతున్నాయి. నిన్న తుమ్మల, నేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గురువారం తెల్లవారు జామున 3గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన ఖమ్మంలోని ఇల్లు, పాలేరు క్యాంపు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. జూబ్లిహిల్స్‌ లోని నందగిరి హిల్స్‌ వద్ద నివాసంలోనూ మూకుమ్మడిగా అధికారులు ప్రవేశించి నివాసంలో ఉన్నవారి నుంచి సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం.

చెప్పినట్టే జరుగుతోంది

బలమైన నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయా ?  ఒక పార్టీనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు ? దీని వెనుక ఎవరు ఉన్నారు ? ఇప్పటికే ప్రచారం ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్యబంధం గురించి ఈ ఐటీ సోదాలతో ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.  తనపై ఐటీ దాడులు జరుగుతాయని ఇప్పటికే పొంగులేటి వ్యాఖ్యానించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని చెప్పారు. పొంగులేటి వ్యాఖ్యానించిన మరుసటిరోజే ఐటీ శాఖ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. కొంతకాలం క్రితం వరకు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆ పార్టీ అధినేతతో విబేధించి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ను వీడిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ పై, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో- చైర్మన్‌ గా ఉన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం ఈసీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీ సిటీలో ఉన్న తుమ్మల నివాసంలో ఈసీకి సంబంధించిన ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నేతల ఇల్లు, కార్యాలయాలపై వరుసగా అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఖండిరచిన రేవంత్‌ రెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై  జరుగుతున్న ఐటీ దాడులను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఖండిరచారు.  నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్‌ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం అని రేవంత్‌ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్‌ ఎందుకు జరగడం లేదని రేవంత్‌ నిలదీశారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ ,  కేసీఆర్‌  బెంబేలెత్తుతున్నారని విమర్శించారు.  ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆరోపించారు.  ఈ దాడులను తాను  తీవ్రంగా ఖండిస్తున్నానన్న రేవంత్‌ ...  2023 నవంబర్‌ 30న కాంగ్రెస్‌ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !