IT Rides : కాంగ్రెస్‌ నేతలే టార్గెట్‌గా ఐటీ రౖెెడ్స్‌...బీజేపీ హస్తం ఉందా ?

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.  ప్రత్యేకించి కాంగ్రెస్‌ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయపరమైన చర్చకు దారి తీశాయి. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు అర్ధరాత్రి దాకా జరగ్గా.. శుక్రవారం ఉదయం కూడా అవి కొనసాగుతున్నాయి. పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్‌ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విప్సర్‌ వ్యాలీలో ఉన్న  సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి ఇంట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి దాకా మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఉదయం మరోసారి చేపట్టారు. నార్సింగ్‌లోని ఇంటితో పాటు మదాపూర్‌లోని కేఎల్‌ఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ తనిఖీలు కొనసాగుతున్నాయి.  బడంగ్‌ పేట్‌ మేయర్‌ పారిజాతం ఇంట అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.  మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడి నిన్న ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగాయి.

MLA సీట్లు BRS కి...MP.సీట్లు BJP కి ? 

నేటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీఆర్‌ఎస్‌కు బీజేపీ సహకరిస్తుందనే అని అనుమానం కలగకమానదు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై ఎటువంటి రైడ్స్‌ జరగకపోవటం కేవలం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు చేలరేగుతున్నాయి. మరోవైపు బీజేపీ అన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచంద్రరావు, డికే అరుణ, విజయశాంతి వంటి అగ్రనాయకులు ఎవరూ ఎన్నికల్లో పాల్గొనక పోవటం వెనుక పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు సహాకరిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీకి సహాకరించటం ద్వారా...వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరించేలా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా ? ఆ దిశగానే రాజకీయాలను నడిసిస్తున్నారా ? రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండి ఎలా పరోక్షంగా సహకరిస్తుందో, అదేవిధంగా ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ బీఆర్‌ఎస్‌కు సహకరింస్తోందని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. మేడిగడ్డ కుంగినా ప్రతిపక్ష పార్టీగా ఎలాంటి ఆందోళనలు చేయకుండా జస్ట్‌ ఒక ప్రెస్‌మీట్‌తో సరిపెట్టటం, ప్రాజెక్టులపై దోపిడీని నిలదీయకపోవటం వెనుక దాగిన వ్యూహాత్మక మౌనం పాటించటం వెనుక ఉన్న రహస్యాలను ప్రజలు గుర్తించలేరు అనుకోవటం ఆయా పార్టీల అమాయకత్వానికి నిదర్శనం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !