Modi : డీప్‌ఫేక్‌...సమాజానికి ప్రమాదం !

0

సెలబ్రిటీలతో పాటు మహిళలకు పొంచిఉన్న ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘డీప్‌ ఫేక్‌లను’ (DeepFake) సృష్టించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను (Artificial Intelligence) దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకర అంశమని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలని కోరారు. ‘డీప్‌ఫేక్‌ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్‌ అయ్యింది. తెలిసినవాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్‌ చేశారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు.. ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై అవగాహన కల్పించాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయినప్పుడు వాటిని ఫ్లాగ్‌ చేసి, వార్నింగ్‌ ఇవ్వాలని చాట్‌జీపీటీ బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడిరచారు.

ఫిర్యాదు అందిన 36 గంటల్లో

ఇటీవల నటి రష్మికకు చెందిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌ నటీమణులు కత్రినా కైఫ్‌, కాజోల్‌ కూడా ఈ డీప్‌ఫేక్‌ బారినపడ్డారు. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు, సినీతారలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్రం దీనిపై స్పందిస్తూ.. మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలపై ఎక్స్‌(ట్విటర్‌), ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మార్ఫింగ్‌ ఫొటోలపై ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. నిబంధనలు పాటించని సంస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఎవరైనా, ఏదైనా కమ్యూనికేషన్‌ పరికరం లేదా కంప్యూటర్‌ రిసోర్స్‌ వినియోగించి వ్యక్తులను మోసం చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా పడుతుందని హెచ్చరించింది. భారతదేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’ (అభివృద్ధి చెందిన భారతదేశం)గా మార్చాలనే తన సంకల్పాన్ని మోదీ.. ఈ సందర్భంగా ప్రస్తావించారు. వోకల్‌​ ఫర్‌​ లోకల్‌​కు ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. కొవిడ్‌​ సమయంలో భారత్‌​ సాధించిన విజయాలు.. దేశ అభివృద్ధి ఇప్పట్లో ఆగదనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాయని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !