తండేల్ అంటే బోట్ నడిపేవారు అని అర్థం.
అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాగచైతన్య బర్త్ డే గిఫ్ట్ గా ఒక రోజు ముందే నాగ చైతన్య లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమా వస్తున్న ఈ ప్రాజెక్టుకు తండేల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈమేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తండేల్ అంటే బోట్ నడిపేవారు అని అర్థం. గుజరాత్ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అందమైన ప్రేమకథతో పాటు.. ఊహించని ట్విస్టులు టర్న్స్ తో ఈ సినిమా సాగనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక పోస్టర్ లో నాగ చైతన్య లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ పోస్టర్ లో నాగ చైతన్య తెడ్డు పట్టుకోని, కర్లీ హెయిర్ తో, ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. రిప్డ్ ఫిజిక్ ని చూపిస్తూ నాగ చైతన్య కనిపించిన విధానం కేవలం అక్కినేని అభిమానులకే కాదు సినీ అభిమానులందరినీ మెప్పించేలా ఉంది. చూస్తుంటే తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకునేలా ఉన్నాడు. రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో తండేల్ సినిమా తెరకెక్కుతుంది. మరి జాలరిగా కనిపించనున్న చైతన్య ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి. ఇప్పటికైతే తండేల్ పోస్టర్ తో ఇప్పటివరకూ కనిపించని నాగ చైతన్యని చూసాం. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
#NC23 is #Thandel
— chaitanya akkineni (@chay_akkineni) November 22, 2023
A character I’m really looking forward to playing .. and a team I’m really fond of @chandoomondeti, @Sai_Pallavi92, @ThisIsDSP and every one at @GeethaArts.
Shoot begins soon :)
దుల్లకొట్టేదాం ✊🏽
జై దుర్గా భవాని🙏#AlluAravind #BunnyVas #Riyaz @ThisIsDSP… pic.twitter.com/Waeahc3Psa