Crocodile : అనంత పద్మనాభస్వామి కొలనులో కొత్త మొసలి

0

ప్రకృతిలో ఎప్పుడూ ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. నమ్మడానికి వీలు లేకున్నా కళ్ళ ముందు కనిపించే సాక్ష్యాలు మనల్ని ఎప్పుడూ విస్మయానికి గురి చేస్తుంటాయి. హిందూ దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన, ఎంతో మహిమాన్వితమైన, ఎన్నో వింతలకు కేంద్ర బిందువైన ఆలయాలు కూడా ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ముఖ్యమైనది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మనం నమ్మలేని ఎన్నో వింత విషయాలు ఉన్నాయి. అటువంటి వింతలలో పద్మనాభ స్వామి దేవాలయంలోని కొలను ఒకటి.  

బబియా స్థానంలో మరో మొసలి

కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి ప్రత్యక్షమైంది. ఈ కొలనులో ఆలయ అధికారులు, సిబ్బందికి ప్రమేయం లేకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఒక మొసలి వచ్చి ఉంటుంది. భక్తులకు ఎవరికి హాని చేయని శాకాహార మొసలి ఈ కొలనులో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలలో ఇది ముఖ్యంగా చెప్పదగినది. గతంలో ఈ కొలనులో బబియా అనే ఒక మొసలి ఉండేది. ఆ మొసలి పండ్లు పలహారాలు తప్ప మరేమీ తినేది కాదు. గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్‌ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. ఇది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరొక మొసలి ప్రత్యక్షం కావడం ఎంతోకాలంగా అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో జరుగుతుంది. ఇప్పటివరకు మూడు మొసళ్ళు అదేవిధంగా కనిపించాయి. గత ఏడాది చనిపోయిన బబియా మొసలి మూడవది. 

తాజాగా నాలుగవ మొసలి

ఈ మొసలిని నవంబరు 8న గుర్తించిన కొందరు భక్తులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన పూజారికి ఈ సమాచారం అందించామని, ఏం చేయాలో ఆయనే నిర్ణయించనున్నట్లు వెల్లడిరచారు. తాజాగా కనిపించినది నాలుగవ మొసలి. ఒకప్పుడు ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని, బ్రిటిష్‌ వాళ్ళు దాన్ని కాల్చేయడంతో దాని స్థానంలో మరో మొసలి వచ్చిందని, ఆ తరువాత బబియా, ఇప్పుడు మరో మొసలి కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ కొలనులో ఇంకా మొసళ్ళు ఉన్నాయా? ఒకటి చనిపోయిన తర్వాత మాత్రమే ఇంకొకటి ఎందుకు కనిపిస్తుంది? ఇదంతా అనంత పద్మనాభుడి లీలనా అని అక్కడికి వచ్చిన భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ సీక్రెట్‌ వెనుక అసలు కారణం ఏమిటి? అనేది అందరూ చర్చిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !