అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున హుజురాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు. రాజకీయాల్లో గెలుపు ఎంత ముఖ్యమో.. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతకు దిగజారుతారో పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మాకు ఓటేయకుండా ఇక మీ ఇష్టం..మా ముగ్గురు శవాలను చూడండీ అంటూ క్లయిమాక్స్ డైలాగ్స్ పేల్చారు. అంతేనా.. ఓటేసి గెలిపిస్తే విజయ యాత్రకు వస్తా.. లేకుండా 4వ తేదీ మా శవయాత్రకు రండి అంటూ ఓటర్లకు షాక్ ఇచ్చారు. మీ కడుపులో తలపెడతా.. మీ కాళ్లు పట్టుకుంటా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ దయ, మీ దండం.. ఒక్కసారి కాపాడండి.. ఒక్కసారి కాపాడండి.. గెలిపించండి.. ఓడగొట్టి ఉరితీసుకోమంటారా అంటూ ఊహించని కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై పోటీకి దిగారు. ప్రచారం చివరి రోజు హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఓట్లు వేయరు అనుకున్నారో ఏమో.. ఏకంగా చస్తానంటూ బెదిరింపులకు దిగటం చూస్తుంటే.. గెలుపు కోసం పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా ఫైట్ చేస్తుంది అర్థం అవుతుంది.
నాకు ఓటేసి గెలిపించండి.. ఓడిస్తే నా శవయాత్ర చూస్తారు.. పాడికౌశిక్.. పాడే ఎక్కుతానంటున్నాడు.. @BRSParty_News #PADIKAUSHIKREDDY @INCTelangana #Huzurabad #TelanganaElections2023 pic.twitter.com/CSCkYaHH0X
— raghu addanki (@raghuaddanki1) November 28, 2023