Party Activists : కిరాయి (అద్దె) కార్యకర్తలు !

0

ఇప్పుడంతా ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో మీటింగుల మీద మీటింగ్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు అంతా కిరాయి కార్యకర్తలదే హవా ! ఫోటోల కోసం, వీడియోల కోసం, మీడియా కవరేజ్‌ల కోసం...భారీబహిరంగసభ అనే పేరు కోసం ప్రధాన పార్టీలన్నీ కిరాయి కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. నాయకుల వెనుక నడిచే అసలు సిసలైన కార్యకర్తలు వెళ్ళపైనే లెక్కించవచ్చు, కానీ సభలన్నీ సక్సెస్‌ అయినట్టు చూపించాలంటే అద్దె కార్యకర్తలే దిక్కు. 

కార్యకర్త కానీ కార్యకర్త  ! 

ఏ నాయకుడైనా ఒక ప్రాంతంలో మీటింగ్‌ పెడితే అది సక్సెస్‌ కావాలని కోరుకుంటాడు. ఎంత జనం ఉంటే అంత సక్సెస్‌ అయిందని చెప్పుకుంటారు. జనం అంతా తనవైపే ఉన్నారని మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తారు. గాలి తమ వైపే వీస్తుందని భ్రమింపజేస్తారు. కానీ అసలు సంగతి వేరే ఉంది. ఎలాంటి బహిరంగ సభకైనా, భారీ ర్యాలీలు తీయాలన్నా నేటి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఆధారపడేది అద్దె కార్యకర్తలపైనే.  కానీ వీళ్ళంతా సామాన్యులే.  ప్రతి ఏరియాలోని బస్తీల్లో వివిధ వృత్తుల్లో నిత్యం బిజీగా ఉండే మహిళలందరూ ఎన్నికల సమయంలో ఒక గ్రూప్‌గా జట్టు కడతారు. ప్రధాన పార్టీలు నిర్వహించే ఇంటింటి ప్రచారం, ర్యాలీ, మీటింగ్‌లకు హాజరైయ్యేందుకు వీలుగా  40 నుండి 50 మంది సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడతారు. వీరిదంరికీ ఒక మహిళ అందరికీ నాయకత్వం వహిస్తుంది.  ప్రతీ మహిళకు కూలీగా రూ. 200/`లకు ఇస్తున్నారు. భోజనం, మంచి నీళ్ళు అదనం. మరో వైపు బైక్‌ ర్యాలీల పేరుతో కుర్రాళ్ళను పొగేసి బైక్‌కి నెంబర్‌తో తీసుకుంటారు. బైక్‌ మీద ఇద్దరు చొప్పున జెండాలు తీసుకుని రూ. 500/` ముట్ట జెప్తున్నారు. వీరికి భోజనవసతితో పాటు మంచి నీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. కొంచం బాగా పలుకుబడి ఉన్న  కుర్రాళ్ళను ఆకర్షించటం కోసం మందును అందిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల మీటింగ్‌ అయితే  ప్రతి ఏరియాలోని మున్సిపల్‌ కార్పొరేటర్‌ ఆయన ప్రధాన అనుచరులు, గ్రామాల్లో అయితే సర్పంచ్‌, వార్డు సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇతర పార్టీల కోసం ఆయా ప్రాంతాల్లో ముఖ్య నాయకులుగా పేరుగాంచిన నాయకులు వారి అనుచరులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఎమ్మేల్యే అభ్యర్థుల నుండి ప్రతీ మహిళకు రూ.500/` చొప్పన, బైక్‌ ర్యాలీలో బైక్‌ల కోసం రూ. 1000/`  వసూలు చేస్తున్న నాయకులు, అద్దె కార్యకర్తలకు ఇస్తుంది మాత్రం కేవలం రూ. 200/` కాగా,  బైకర్లకు ఇచ్చేది రూ. 500/` మాత్రమే. మిగిలిన రూ. 300/`, రూ. 500/` దళారులే దోచుకుంటున్నారు. వచ్చిన అద్దె కార్యకర్తలు ఆయా నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయటం, వివిధ రకాల విన్యాసాలు చేయటం మీడియా అటెన్షన్‌ కోసమే తప్పించి మరోకటి లేదు. సభలకు హాజరైయ్యే వారందరూ అసలు కార్యకర్తలు కాదు, వీరంతా ఓటేస్తారనే గ్యారెంటీ లేనే లేదు. ఇదంతా నాయకులు చేసే జిమ్మిక్కు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !