PM Modi : మోదీ చాణక్యం...బీజేపీ పుంజుకునే అవకాశం !

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 లేదా 5 సీట్లకే పరిమితం, పోటీ అంతా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే అనుకుంటున్న తరుణం మోదీ చాణక్యం అందరి అంచనాల్ని తారుమారు చేసింది. ఎస్సీ వర్గీకరణతో ఒక్కసారిగా మాదిగ సామాజిక వర్గం అంతా బీజేపీ వైపు మొగ్గు చూపేలా ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేశారు. మోదీ ప్రకటనతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీసీలను ఏకం చేసి తమ వైపు తిప్పుకునే ప్రకటన చేసిన మోదీ, ఎస్సీ వర్గీకరణతో మరో పావు కదిపారు. మరికొద్ది రోజులే మిగిలిన ఉన్న ఎన్నికల సమయంలో బీజేపీ ఒక్కో అస్త్రాన్ని నింపాదింగా సంధిస్తోంది. ఈ సారి అగ్రకులాలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదును చూసి దెబ్బకొడుతోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగిన నాటకీయ పరిణామాలు మాదిగ సామాజికవర్గాన్ని కదిలించాయనే చెప్పవచ్చు. ఎందుకో గానీ మోదీ మాటల్లో నిజాయితీ కనిపించింది. మనసును హత్తుకుంది. పెద్ద నాయకుడు క్షమాపణ చెప్పటంతో నేరుగా జనం హృదయాలను కదిలించిందనే చెప్పాలి.ఈ సారి ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లనీ ఏకపక్షంగా బీజేపీకే పడే అవకాశం మెండుగా ఉంది. మరో వైపు పార్టీ మారిన నాయకుల్లోనూ కలవరం మొదలైందని చెప్పాలి. మోదీని తక్కువ అంచనా వేసినందుకు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీఆర్‌ఎస్‌, ఆప్‌ పార్టీల లిక్కర్‌ స్కామ్‌ గురించి మాట్లాడారు. ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. అంటే వచ్చే 10 రోజుల్లో అవినీతిని బయటపెట్టి అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. 

పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం

మోదీ మాట్లాడుతూ.. ‘పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు నేను వచ్చాను. పార్టీలు చేసిన తప్పులకు నేను క్షమాపణ చెబుతున్నాను. పేదరిక నిర్మూలన మా తొలి ప్రాధాన్యత. సామాజిక న్యాయం దిశగా మేము అడుగులు వేస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పోరాటం చేశాయి. దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్‌, ప్రభుత్వం ఏర్పడగానే తానే ముఖ్యమంత్రి అయ్యి దళితుల ఆశాలపై నీళ్లు జల్లాడు. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత బంధుతో కూడా లాభం జరగలేదు’ అని చెప్పుకొచ్చారు.ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. ‘తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్‌ కాపాడలేకపోయింది. కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్‌ అంబేద్కర్‌ని అవమానించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దళిత విరోధులు, ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో ఇరిగేషన్‌ స్కీమ్‌లు, ఇరిగేషన్‌ స్కామ్‌ల మారాయి. ఆదివాసీ మహిళను మేం రాష్ట్రపతిగా ప్రాతిపాదించాం, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆమెను అవమానించింది. బీఆర్‌ఎస్‌ రైతు రుణమాఫీ చేస్తామంది, ఎంత మాఫీ చేశారో చెప్పగలరా.?’అని మోదీ ప్రశ్నించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !