తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ప్రారంభమైన రోడ్ షో.. నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీర్ సావర్కర్ విగ్రహం వరకు సాగింది. రెండు కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్‌షోలో.. ప్రధాని మోడీని చూసేందుకు బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికలు తుది అంకానికి చేరుకోవడంతో.. కమలనాథుల విజయమే లక్ష్యంగా రాజధాని పరిధిలో మోదీ భారీ రోడ్ షోను నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య నమో నామస్మరణతో ఎంతో కోలాహలంగా రోడ్ షో రెండు కిలోమీటర్ల మేర సాగింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించారు. మోదీతోపాటు రోడ్‌షోలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ జనసంద్రోహం ప్రధాని మోదీని చూసేందుకు పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. 2 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో అశేష జనం చేసిన.. నమో నామస్మరణతో రోడ్లన్నీ మోతమోగాయి. రోడ్ షోను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ముందుగానే ఆ రూట్లలో బస్సులను డైవర్ట్ చేసింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్ షోకు 2 గంటల ముందుగానే ట్రాఫిక్ నిలిపివేశారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు ముందుగానే ప్రకటించారు. మరోవైపు తాజా రోడ్‌షోతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది.