తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ దూకుడు పెంచింది. ఈ మిషన్‌లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని హామితో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణతో విడదీయలేని అనుబంధం
సమ్మక్క, సారక్క, యాదాద్రీశుడికి నమస్కరిస్తూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కుటుంబసభ్యుల మధ్యన ఉన్నట్లు అనిపిస్తోందని మోదీ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. ఈ నేలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్న మోదీ.. తనను ప్రధాని చేసేందుకు బీజం పడిరది ఈ స్టేడియంలోనేనని మోదీ గుర్తు చేశారు.తెలంగాణ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తుందన్న ప్రధాని.. తెలంగాణ సర్కార్ బీసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ తన కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్‌ఎస్ అంటూ ప్రధాని అన్నారు. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి ఎల్బీ స్టేడియంలోనే పునాది పడిరదని, ఇప్పుడు బీసీని తెలంగాణ ముఖ్యమంత్రి చేయడానికి కూడా ఇక్కడే నాంది పడుతుందని ప్రధాని అన్నారు. జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేసింది కూడా ఎన్‌డీఏ ప్రభుత్వమేనని మోదీ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది తామేనన్న ప్రధాని.. బీసీ వ్యక్తిని ప్రధానిగా చేసిన తనను గౌరవించారన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారని తెలిపారు. కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులున్నారన్న ప్రధాని, పార్లమెంట్‌లో 85 మంది బీసీ ఎంపీలు ఉన్నారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో మహిళల గౌరవం కోసం కోట్లాది టాయిలెట్స్ నిర్మించామని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ప్రధాని ఆరోపించారు.
VIDEO | "It feels like I have come to my family. You all are my family," says PM Modi at a public rally in Hyderabad. #TelanganaElections2023 #AssemblyElectionsWithPTI pic.twitter.com/L3ftIY7TSt
— Press Trust of India (@PTI_News) November 7, 2023