Telangana Elections : గులాబీ బాస్‌కి ఓటమి గుబులు ! రంగంలోకి పీకే !!

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కారు పార్టీ రివర్స్‌ గేర్‌లో నడవనుందా ? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం అని పదే పదే చెబుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సడన్‌గా ఓటమి గుబులు వేధిస్తోందా ? కాంగ్రెస్‌ ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్‌ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదీ అసలు కథ..!

నిన్నటి దాకా హ్యాట్రిక్‌ కొడుతున్నాం.. అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చు కానీ కచ్చితంగా అధికారంలోకి వస్తాం అనుకున్న కేసీఆర్‌ సార్‌కి గ్రౌండ్‌ లెవల్‌ రిపోర్ట్‌, ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్స్‌, అంతర్గత సర్వేలు షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ రిపోర్ట్‌లను అంత సీరియస్‌గా తీసుకోకపోయినప్పటికీ...పొరపాటున ఓడిపోతే...ఆ నిజాన్ని జీర్ణించుకోలేని గులాబీ బాస్‌...వాస్తవంలోకి వచ్చారు.  దీంతో హుటాహుటిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను రంగంలోకి దించారు. హైదరాబాద్‌కు పిలిపించుకుని అత్యవసర భేటీ నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిపారు. నువ్వు ఏం చేస్తావో నాకు తెల్వదు... ‘ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందే.. ఉన్న ఈ కొద్దిరోజుల్లో ఎలా వ్యూహాలు రచిస్తావో.. ఏం చేస్తావో నీ ఇష్టం...ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే’ ఇదొక్కటే పీకేకు పదే పదే కేసీఆర్‌ చెప్పారట.ఆ తర్వాత కేటీఆర్‌, హరీష్‌ రావు, కవిత కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు విషయాలు చర్చించినట్లుగా సమాచారం. దీంతో కాస్త టైమ్‌ ఇవ్వాలని కోరిన పీకే ఫైనల్‌గా ఓకే అన్నట్లుగా తెలిసింది. పీకే కాదనలేనంతగా భారీ ఆఫర్‌ చేయడంతో ఓకే అన్నట్లు తెలియవచ్చింది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న గురురాజ్‌ అంజన్‌ అనే వ్యక్తి ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ వేదికగా రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ ట్వీట్‌ గురించే రచ్చ రచ్చ జరుగుతోంది. 

పీకే ప్లాన్స్‌ ఎలా ఉంటాయి ? 

వచ్చే వారంలో ఏం జరగనుంది ?

గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలతో పాటు టీఆర్‌ఎస్‌ కోసం కొన్ని రోజులు పనిచేసిన అనుభవం ఉండటంతో పీకే బీఆర్‌ఎస్‌ కోసం పనిచేసేందుకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు అతికొద్ది సమయమే ఉండటంతో పీకే వ్యూహాలు రచించటంలో తన టీమ్‌తో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిస్తే...ఆయనకు ఉన్న మొదటి ఆప్షన్‌ ‘సానుభూతి’. అతితక్కువ సమయం ఉన్నందున ప్రజల్లో నాయకుడిపై సానుభూతి వచ్చేలా ప్లాన్‌ చేసే అవకాశం ఉంది. (ఉదాహరణకి : బెంగాల్లో మమతా బెనర్జీకి కాలు విరిగిపోవటం, వైజాగ్‌లో జగన్‌పై కోడికత్తి దాడి). ఇక రెండవ ఆప్షన్‌కి వస్తే భారీ తాయిలాలు ప్రకటించటం : కనీవినీ ఎరుగని రేంజులో అన్నీ వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవాలంటే అందరికీ లాభం చేకూర్చే కార్యక్రమం జరగాలి. (ఉదాహరణకి : 5 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ, గోల్డ్‌లోన్‌తో సహా)...ఇక మూడవ ఆప్షన్‌ : తెలంగాణ సెంటిమెంట్‌ని మరోసారి వాడుకోవటం ( తెలంగాణ సమాజం మొత్తం ఏకమయ్యేలా ప్రక్కరాష్ట్రాలతో పంచాయితీ పెట్టుకునేలా ప్లాన్‌ చేయటం, ఇంకా ఇతరాలు ), ఇక 4 వ ఆప్షన్‌కి వస్తే...తెలంగాణ సమాజాన్ని కులాల వారీగా, మతాల పరంగా చీల్చటం (అంత సమయం లేదు కాబట్టి ఈ ఆప్షన్‌ని అంతగా పరిగణనలోకి తీసుకోకపోవచ్చు).. మరో ఆప్షన్‌ ఏమిటంటే ...దిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్‌ చేయటం, సానుభూతిగా మలుచుకోవటం. ఇక మరో ఆప్షన్‌ బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వీడియో రిలీజ్‌ చేయటం ( ఇప్పటి వరకు రేవంత్‌ రెడ్డి వీడియో, ఎమ్మేల్యేలను కొనేందుకు ప్రయత్నించిన బీజేపీ సంతోష్‌ చేసిన ఫామ్‌హౌస్‌ వీడియోలు బాగా సక్సెస్‌ అయ్యాయి, బీఆర్‌ఎస్‌కు మైలేజ్‌ తెచ్చాయి ) ఇక మరో అస్త్రం...ఓటుని అందరి కంటే ఎక్కువ రేటుతో కొనటం (ఓటుకి 5000/` లేదా 10000/` ఇచ్చి కొన్నా బీఆర్‌ఎస్‌కే వేస్తారని గ్యారెంటీ లేదు, ఓటరు మనసులో ఏముందో అదే చేస్తాడు, డబ్బు ఇచ్చినా ఓటు వేస్తారనే గ్యారెంటీ లేదు)... మరో ఆప్షన్‌...కాంగ్రెస్‌, బీజేపీలో ఉన్న బీఆర్‌ఎస్‌ అనుకూల నాయకుల చేత బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వంపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేయించటం...ఇలాంటి ఆప్షన్స్‌ ఎన్నో ఉన్నాయి. ఈ వారం రోజులు తెలంగాణ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజల మైండ్‌ని మార్చేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ప్రజలారా...జర...పైలం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !