Animal : బాక్సాఫీస్‌ వేటకు సిద్ధమైన...యానిమల్‌ !

0

సందీప్‌ రెడ్డి వంగ ది మాస్టర్‌ స్టోరీ టెల్లర్‌. ప్రేక్షకుల పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌. అనిమల్‌ ట్రైలర్‌ ని మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్స్‌ కట్‌ చేసాడు. ఆడియన్స్‌ మతులు పోగొడుతోంది. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషనల్‌ సీన్‌ తో మొదలైన ఈ ట్రైలర్‌ నెక్స్ట్‌ లెవల్‌ సీన్స్‌ అండ్‌ విజువల్స్‌ తో మెస్మరైజ్‌ చేస్తోంది. ఒక్కో షాట్‌, ఒక్కో విజువల్‌ గూస్బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు యానిమల్‌ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం నెక్స్ట్‌ లెవల్‌ కు తీసుకెళ్లింది యానిమల్‌ ట్రైలర్‌. ఇక ఈ ట్రైలర్‌ చూశాక బాలీవుడ్‌ లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్‌ అన్నీ బ్రేక్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌ తో శాంపిల్‌ చూపించిన సందీప్‌ రెడ్డి వంగ%ౌౌ% ఇటీవలే అనిమల్‌ ట్రైలర్‌ చూస్తే పడుకోలేరు అంటూ ట్వీట్‌ చేసాడు. ఇది క్యాజువల్‌ మాట కాదు, అనిమల్‌ ట్రైలర్‌ చూస్తే నిజంగానే రిలాక్స్‌ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. సందీప్‌ రెడ్డి ముందుగా చెప్పినట్టుగానే.. తనదైన యాక్షన్‌ సీన్స్‌ తో రెచ్చిపోయాడు. వైలెన్స్‌ అనే పదానికి సరైన డెఫినేషన్‌ ఇవ్వబోతున్నాడని క్లియర్‌ గా అర్థమవుతోంది. ఇప్పటికే అర్జున్‌ రెడ్డి లాంటి రా అండ్‌ ఎమోషనల్‌ కంటెంట్‌ తో సంచలనం సృష్టించిన సందీప్‌ రెడ్డి వంగా.. యానిమల్‌ సినిమాతో మరో సంచలనానికి తెరతీసేలా కనిపిస్తున్నారు. 

సెంటిమెంట్‌తో ఉంటే ఒక మోస్ట్‌ వయొలెంట్‌ ఫిల్మ్‌

రణబీర్‌ కపూర్‌ టెర్రిఫిక్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ ఇది పూర్తిగా డైరెక్టర్స్‌ ఫిల్మ్‌ అనే విషయం తెలిసిపోతుంది. మేకింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, ఆర్టిస్టుల యాక్టింగ్‌. వాట్‌ నాట్‌ అనిమల్‌ ట్రైలర్‌ లోని ప్రతి ఎలిమెంట్‌ గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ఉంది. హ్యూజ్‌ గన్‌ ఫైరింగ్‌ షాట్‌ అండ్‌ ట్రైలర్‌ ఎండ్‌ లో బాబీ డియోల్‌-రణబీర్‌ కపూర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ లు అయితే మెంటల్‌ ఎక్కించేలా ఉన్నాయి. ఇలాంటి ట్రైలర్‌ కట్‌ ని సందీప్‌ రెడ్డి వంగ మాత్రమే చెయ్యగలడు. సింపుల్‌ గా చెప్పాలి అంటే యానిమల్‌ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఉంటే ఒక మోస్ట్‌ వయొలెంట్‌ ఫిల్మ్‌. ఈ సినిమా చేయబోయే విధ్వంసం బాక్సాఫీస్‌ దగ్గర ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలి అంటే డిసెంబర్‌ 1 వరకూ వెయిట్‌ చెయ్యాల్సిందే. టాలీవుడ్‌ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా నుండి వస్తున్న లేటెస్ట్‌ మూవీ యానిమల్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషనల్‌ కంటెంట్‌ తో అండర్‌ వరల్డ్‌ క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, పృథ్వీరాజ్‌ వంటి స్టార్‌ కీ రోల్స్‌ లో కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !