OpenAI ఇటీవల తన కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ను (Sam Altman) కంపెనీ నుంచి తొలగించింది. ఆయన పనితీరుతో సంతృప్తి చెందలేదంటూ బోర్డు దీనికి కారణంగా పేర్కొంది.అయితే తొలగింపు జరిగిన రోజుల వ్యవధిలోనే సామ్ ఆల్ట్‌మాన్‌ను తన వైపు తిప్పుకునేందుకు ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. దీంతో మాజీ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో (Microsoft) చేరబోతున్నారని వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు గ్రిగ్ బ్రోక్ మ్యాన్ సైతం మైక్రోసాఫ్ట్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామ్, గ్రిగ్‌తో పాటు వారి బృందం చేరికను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ధృవీకరించారు. మైక్రోసాఫ్ట్ ప్రకటనపై ఎలాన్ మస్క్ సైతం స్పందించారు. సామ్ టీమ్ విజయవంతం కావడానికి అవసరమైన వనరులను అందించడానికి తాము ఎదురుచూస్తున్నామని సత్య నాదెళ్ల తన ట్వీట్ లో వెల్లడిరచారు. సామ్ ఆల్ట్‌మాన్ తొలగించబడిన తర్వాత OpenAI పెట్టుబడిదారులు ఆయనను తిరిగి నియమించుకోమని కంపెనీ బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. దీంతోOpenAI బోర్డు తరువాత సంస్థకు CEOగా తిరిగి రావడానికి సామ్ ఆల్ట్‌మాన్ తో చర్చలు ప్రారంభించింది.అయితే ఇకపై సామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌తో కలిసి పని చేయనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న వ్యాపార వాతావణంలో గూగుల్ బార్డ్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు అవసరమైన సాంకేతికత పూర్తి స్థాయిలో మైక్రోసాఫ్ట్ వద్ద సంసిద్ధంగా సామ్ రూపంలో ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న కాలంలో రెండు ప్రపంచ దిగ్గజాల మధ్య పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఇది దోహదపడుతుందని చెప్పుకోవచ్చు.
the mission continues https://t.co/d1pHiFxcSe
— Sam Altman (@sama) November 20, 2023