- సామాన్యుల కోసం కార్పొరేట్లతో ఢీకొడుతున్న ధీశాలి.
- రాథాకృష్ణ టోయోటా లాంటి కార్పొరేట్ మోసాలను వెలుగులోకి తెచ్చి మూసివేసియించిన పోరాటయోధుడు
- జయ గ్రూప్ ఆక్రమాలు వెలుగులోకి తెచ్చి రేరా చర్యలు తీసుకునేలా చేసిన పరాక్రమశీలి.
- రాజకీయాల్లో మార్పు కోసం ఉప్పల్‌లో పోటీ చేస్తున్న సుంకర నరేష్
- ప్రత్యేక మానిఫెస్టోతో ప్రజల ముందుకు
రారా వ్యవస్థను మార్చేద్దాం...రారా మార్పుకు మనమే శ్రీకారం చుడదాం అంటూ యువతకు, పేదమధ్యతరగతి వర్గాలకు ఆశాజ్యోతిగా మారారు సుంకర నరేష్. సమస్య వస్తే నాయకుడి ఇంటి ముందు కాపు కాసే బానిసత్వపు పోకడలు మార్చేసి, సమస్య ఉన్నచోటికే నాయకుడి వచ్చి పరిష్కరించే నవసమాజం కోసం నడుంకట్టిన యువకుడే సుంకర నరేష్. ఇప్పటికే సామాజిక బాధ్యతలో భాగంగా ఎన్నో సమస్యలపై పోరాడుతూ కొన్ని సందర్భాలలో వెరవని తెగువ చూపుతూ కార్పొరేట్ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. సామాన్యులకు అండగా నిలుస్తున్నాడు.
సుంకర నరేష్ నేపథ్యం.
కుషాయగూడకు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్. విద్యార్థి దశలోనే బస్సుపాసుల సమస్యలు, కౌన్సిలింగ్‌లో జరుగుతున్న అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై గళం విప్పి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పోరాటాలు జరిపారు. ఓటర్ ఇండియా 2014 యాప్‌తో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను ప్రజలకు తెలిసేలా యాప్‌ని రూపొందించి కళంకం లేని నాయకులను ఎన్నుకునేలా ప్రజల్లో చైతన్యం నింపారు. వెన్నెల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనాధలకు, మానసిక వికలాంగులకు భోజన వసతుల కల్పిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. ప్రజలకు ఉన్న హక్కులు గుర్తు చేస్తూ, ప్రజా ప్రతినిధుల విధుల మీద ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తూ అన్యాయం జరిగితే ధైర్యంగా ప్రశ్నించాలని ప్రజల్లో చైతన్యం నింపడానికి ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక లాయర్‌గా సమాజంపై ప్రేమతో న్యాయానికి అండగా నిలబడ్డ సుంకర నరేష్...తన మార్గాన్ని మార్చుకున్నారు. ఒక లాయర్‌గా కొంత పరిధిలోనే పరిమితం అవ్వటం ఇష్టంలేక రాజకీయాల్లోనైతే మరింత మందికి న్యాయాన్ని చేరువ చేయగలననే ఉద్ధేశ్యం రాజకీయ గోదాలోకి దిగారు. నిస్వార్థ ప్రజాసేవకు రాజకీయాలే సరైన వేదిక అని నమ్మి ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు.
ఉప్పల్ అసెంబ్లీ బరిలో సుంకర నరేష్ !
సమాజం పట్ల బాధ్యత గల యువతను గుర్తించి వారికి అధికారం అప్పగిస్తే రాజకీయాల్లో కొత్త మార్పు సాధ్యం అవుతుంది.. ఇప్పటికే యువత, మద్యతరగతి ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటుంది. ఉదాహరణ కూడా మన కళ్ళ ముందే ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్కనే (కర్నె శిరీష) తీసుకుంటే...డబ్బులేదు, అంగబలం లేదు, ఒక ఒంటరి ఆడపిల్ల పోరాటానికి ప్రజలే స్వచ్ఛందంగా ముందుండి నడిపిస్తున్న తీరు సదా హర్షనీయం. రాజకీయాల మీద , రాజకీయ నాయకుల తీరు మీద ఉన్న వ్యతిరేక భావనే నేడు సమాజం అంతా ఒక్కటై ఒంటరి ఆడపిల్లకు మద్దతు తెలిపేలా చేస్తుంది. బర్రెలక్క గెలుపోటములు తప్పనపెడితే ప్రజల మద్దతు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. అలాంటి మంచి గురించి ఆలోచిస్తున్న సమాజానికి సుంకర నరేష్ మరో ఆశాదీపంలా కనిపిస్తున్నాడు. రాజకీయం అంటే అధికారం కాదు, పదవి అంటే అలంకారం కాదు...ప్రజాసేవ అని గుర్తు చేస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ నిరసన తెలుపుతూ, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ, వెనువెంటనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్న సుంకర నరేష్ నిజంగా అభినందనీయుడు.
సుంకర నరేష్ సాధించిన విజయాలు
- రాథాకృష్ణ, యశోదకృష్ణ వంటి టోయోటో షోరూంలలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చి సాక్ష్యాలతో సహా కోర్టుల్లో నిరూపించి అన్ని షోరూంలను మూసివేయించి సామాన్యులకు న్యాయం చేశారు.
- ప్రీలాంచ్ పేరుతో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్ అని దాదాపు రూ. 2000 కోట్లకు కుచ్చుటోపి పెట్టి సాహితీ ఇన్‌ఫ్రాపై పోరాడి బాధితులకు న్యాయం జరిగిలా, సంస్థ చైర్మన్‌ను కోర్టు మెట్లు ఎక్కించి జైలు పంపించారు.
- రోడ్లపై వాహనాలు తనిఖీ చేసే సమయంలో బండితాళాలు బలవంతంగా లాక్కొవటం చట్టవిరుద్దం అని పోరాడి కోర్టు ద్వారా మూకుతాడు వేశారు సుంకర నరేష్.
- జయగ్రూప్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను సాక్ష్యాలతో సహా ప్రభుత్వం ముందుంచి, రెరా ద్వారా నిబందనలు ఉల్లఘించినందుకు గాను రూ. 50 లక్షల జరిమానా వేయించి బాధితులకు న్యాయం చేశారు.
ఇంకా ఇలాంటి ఎన్నో, ఎన్నెన్నో...సంఘటనలు...బాధితుల పక్షాల అండగా నిలిచి వారిక న్యాయం చేశారు సుంకర నరేష్. ఇలాంటి దమ్ముధైర్యం ఉన్న యువకుడిని గెలిపించుకోవలసిన అవసరం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలపై ఉంది.