Congress Manifesto : కాంగ్రెస్‌ అభయహస్తం మేనిఫెస్టో !

0

తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణకు అవసరమైనన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పెద్దలు వేణుగోపాల్‌తో పాటూ రేవంత్‌ రెడ్డి తదితర తెలంగాణ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోను గీత, ఖురాన్‌, బైబిల్‌తో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునామీ సృష్టించబోతోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా ఉంటుందన్నారు. 

ఆరు గ్యారంటీలివే..

మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

రైతు భరోసా ప్రతి ఏటా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.

యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌.

చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ముఖ్యంశాలు

  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
  • ఆరు నెలల్లోగా మెగా డీఎస్సీతో అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
  • నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టుల భర్తీ
  • ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్‌, వైఫై సౌకర్యం
  • బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో రాష్ట్రంలో మరో నాలుగు ట్రిపుల్‌ ఐటీలు
  • ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు
  • ఆరోగ్యశ్రీ పథకం కింద మోకాలు సర్జరీ
  • గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ల గౌరవ వేతనం నెలకు రూ. 1500
  • మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్‌
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ మూడు డీఏల తక్షణ చెల్లింపు
  • సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీసీ విధానం అమలు
  • ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్‌టీసీ సిబ్బందికి కొత్త పీఆర్‌సీ అమలు
  • ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం
  • పెండిరగ్‌లో వున్న అన్ని ట్రాఫిక్‌ చలానాలు 50 శాతం రాయితీతో పరిష్కారం
  • బెల్ట్‌ షాపులు పూర్తిగా రద్దు
  • కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్‌లు
  • రైతులకు రూ. 2 లక్షల పంట రుణ మాఫీ
  • జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు
  • ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొ. జయశంకర్‌ పేరిట బీసీ భవన్‌
  • జనగాం జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పేరు
  • వెనుకబడిన తరగతులకు (బీసీ) సబ్‌ ప్లాన్‌ అమలు
  • పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ‘బంగారు తల్లి’ పథకం పునరుద్ధరణ
  • 18 ఏళ్లుపైబడి చదువుకునే ప్రతి యువతికీ ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు
  • అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డేజ్‌ హోమ్స్‌
  • మరణించిన జర్నలిస్ట్‌ కుటుంబాలకు రూ. 5 లక్షలు
  • ప్రజా పంపిణీ రేషన్‌ డీలర్లకు రూ. 5 వేలు గౌరవ వేతనం
  • తెల్ల రేషన్‌ కార్డులపై సన్నబియ్యం
  • దివ్యాంగుల నెలవారీ పెన్షన్‌ రూ. 6 వేలకు పెంపు
  • అంగన్‌వాడీ టీచర్లకు నెలసరి జీతం రూ. 18 వేలు
  • ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిల పెనాల్టీ రద్దు






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !