EC Ban Ads : రాజకీయ ప్రకటనలపై ఈసీ కొరడా !

0

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు ప్రసారం చేసే ప్రకటనలపై కొరడా రaుళిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌.. మూడుపార్టీలు వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్న యాడ్స్‌ను నిలిపివేయాలని షాక్‌ ఇచ్చింది. విషయంలోకి వెళితే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు  యాడ్స్‌ తయారు చేయించుకున్నాయి. వీటికి ఇదివరకు పర్మిషన్‌ లభించింది. తాజాగా వాటికి పర్మిషన్‌ తొలగించింది. ఎందుకు? అని అడిగితే.. అవి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన క్రిందకు వస్తాయి అని తెలిపింది. అంతే.. ఈ పార్టీలు నీరసించిపోయాయి. యాడ్స్‌ విషయంలో కాంగ్రెస్‌కి పెద్ద షాక్‌ తగిలింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన 6 యాడ్స్‌ రద్దయ్యాయి. అలాగే బీజేపీకి చెందిన 5 ప్రకటనలు, బీఆర్‌ఎస్‌కి చెందిన 4 ప్రకటనలకు పర్మిషన్‌ వెనక్కి తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మూడు పార్టీల ప్రధాన కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. పర్మిషన్‌ రద్దు చేసిన యాడ్స్‌ని టీవీల్లో ప్లే అవ్వకుండా చెయ్యాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలన్నీ సెర్టిఫికేషన్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఈసీ తెలిపింది. యాడ్స్‌ రద్దు చెయ్యడమే కాదు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఈ పార్టీలు చూసుకోవాలని కూడా హెచ్చరించింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !