Thrisha : మన్సూర్‌ క్షమాపణలు...క్షమించేసిన త్రిష !

0

నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడుద్దేశం లేదన్నాడు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మన్సూర్‌ పోస్ట్‌పై త్రిష పరోక్షంగా స్పందించారు. ‘‘తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’’ అని తాజాగా ఆమె ట్వీట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..?

మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండిరచారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నడిగర్‌ సంఘం ఆయనపై చర్యలు చేపట్టి ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేయగా మన్సూర్‌ మంగళవారం చెన్నైలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి నోటీసు కూడా ఇవ్వకుండా నాపై నిషేధం ఎలా విధిస్తుంది..? నేను ఏ తప్పూ మాట్లాడలేదని, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేదే లేదన్నారు. ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పేదీ లేదుని, నడిగర్‌ సంఘానికే నేను నాలుగు గంటలు టైమ్‌ ఇస్తున్నా, నాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని వార్నింగ్‌ ఇచ్చారు. 

త్రిషకు క్షమాపణలు

మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు అయ్యింది.  ఈ క్రమంలోనే అతడు వెనక్కి తగ్గి తాజాగా క్షమాపణలు చెప్పాడు. అయితే ఈరోజు మాత్రం మన్సూర్‌ ఆలీ ఖాన్‌ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశా, ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండా నేను గెలిచా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి, అందుకు క్షమాపణలు కోరుతున్నా ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం మీద త్రిష కూడా స్పందించారు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దైవత్వం అని ఆమె తాను క్షమిస్తున్నట్టు ఇన్‌ డైరెక్టుగా ట్వీట్‌ చేశారు.  ఇదిలా ఉండగా, త్రిషకు తాను క్షమాపణలు చెప్పనని తొలుత మన్సూర్‌ ఓ ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అతడు వెనక్కి తగ్గి తాజాగా క్షమాపణలు చెప్పాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !