T Elections : ప్రజాతీర్పు కాంగ్రెస్‌ వైపే ! ఎగ్జిట్‌పోల్స్‌ అంచానాలు !

0

తెలంగాణలో ఎన్నికల కోలహలం ముగిసింది. పోలింగ్‌ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్‌-03 ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు మాత్రం అదిగో అధికారంలో వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రమాణ స్వీకారమే ఇక ఆలస్యం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే.. నవంబర్‌-30న తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అటు పోలింగ్‌ ముగియగానే ఇటు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా వచ్చేశాయి. ఈ ఎగ్జిట్స్‌ పోల్స్‌తో అధికార బీఆర్‌ఎస్‌ కంగుతినగా.. కాంగ్రెస్‌ మాత్రం అంతా అనుకున్నదే అక్షరాలా నిజం అవుతోందని చెప్పుకుంటోంది.

బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా ఎగ్జిట్‌పోల్స్‌

అవును.. హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని కాబోతున్నా.. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.. రాసిపెట్టుకోండి.. ఇవీ గులాబీ బాస్‌ కేసీఆర్‌ నోట పదే పదే వచ్చిన మాటలు. కట్‌ చేస్తే.. సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. గురువారం సాయంత్రం సుమారు 20కి పైగా రాష్ట్ర, జాతీయ ప్రముఖ మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడిరచాయి. ఇందులో ఒకటి అర మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తేల్చగా.. మిగిలినవన్నీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశాయి. మరికొన్ని సర్వేలు మాత్రం మ్యాజిక్‌ ఫిగర్‌కు అటు ఇటుగా కాంగ్రెస్‌కు సీట్లు రావొచ్చని వెల్లడిరచాయి. అంటే ఇంచుమించు 90 శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగిటివ్‌ ఫలితాలే రానున్నాయని జోస్యం చెప్పేశాయి. దీంతో ఒక్కసారిగా గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యిందట.

ఆరా ప్రీ పోల్‌ అంచనాలు..

 బీఆర్‌ఎస్‌కు 41 నుంచి 49, కాంగ్రెస్‌కు 48 నుంచి 67 స్థానాలు,  భాజపా 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.

చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌..

 బీఆర్‌ఎస్‌కు 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్‌ 67 నుంచి 78, భాజపా 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 6-7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వెల్లడిరచింది.

జన్‌కీబాత్‌..

 బీఆర్‌ఎస్‌ 40 నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్‌ 48 నుంచి 64 స్థానాలు, భాజపా 7 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది.

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్‌..

బీఆర్‌ఎస్‌ 48, కాంగ్రెస్‌ 56, భాజపా 10, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌లో తెలిపింది.

పీపుల్స్‌ పల్స్‌ ..

కాంగ్రెస్‌ 62 నుంచి 72 స్థానాల్లో,  బీఆర్‌ఎస్‌ 35 నుంచి 46 స్థానాల్లో, ఏఐఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో, భాజపా 3 నుంచి 8 స్థానాల్లో, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలుపొందే అవకాశముందని పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచానా వేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !