తమిళ్ (Tamil) స్టార్ హీరో విక్రమ్ (Vikram) త్వరలో తంగలాన్ (Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్ (PA Ranjith) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, (Parvathi) మాళవిక మోహనన్ (Malavika Mohan) ఫిమేల్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్, మేకింగ్ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోయారు. టీజర్ విడుదల కార్యక్రమంలో విక్రమ్, పా.రంజిత్ పాల్గొని, పలు విషయాలు పంచుకున్నారిలా. సినిమా కోసం పా.రంజిత్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. తాను తెరకెక్కించిన గత చిత్రం ‘సార్పట్ట’తో పోలిస్తే 100 రెట్లు అద్భుతంగా ఆయన దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా షూట్ ఎంతో క్లిష్టంగా అనిపించింది. మేకప్ కారణంగా షూటింగ్ జరిగినన్ని రోజులూ ఒక్క నిమిషం కూడా సెట్‌లో రిలాక్స్ కావడానికి సమయం దొరకేది కాదు. ‘తంగలాన్’ అంటే కేవలం ఒక సాధారణ సినిమా కాదు. ‘కాంతార’ చిన్న చిత్రమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే, ‘తంగలాన్’ సైతం భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్య పరుస్తుంది. షూట్ సమయంలో కేజీయఫ్ వాసులు ఎలాంటి జీవనాన్ని అయితే గడిపారే అలాగే నేనూ జీవించా’’ అని విక్రమ్ అన్నారు.
డెడికేషన్‌కి ఫిదా !
అనంతరం పా.రంజిత్ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ సమయంలో విక్రమ్ గాయపడ్డారు. పక్కటెముకలకు దెబ్బ తగిలింది. దీంతో ఆయన నెల రోజుల పాటు షూట్ నుంచి విరామం తీసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి కోలుకుని సెట్‌కి వచ్చాక ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. నొప్పి ఉన్నప్పటికి ఆయన నో అనకుండా షూట్ కంటిన్యూ చేశారు. కొన్ని షాట్స్‌కు ఆయనే స్వయంగా వన్ మోర్ అంటూ ముందుకు వచ్చారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని తెలిపారు.ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి కథానాయికలుగా నటిస్తున్నారు. పశుపతి, డానియల్ కాల్టాగిరోన్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బంగారు గనుల దగ్గర ఉండే గ్రామాల్లోని మనుషులు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలు చూపించారు ఈ టీజర్ లో. అలాగే విక్రమ్ ని చాలా భయంకరంగా చూపించారు. కత్తి పట్టుకొని అందర్నీ నరికేస్తూ, ఓ సీన్ లో చేత్తోనే పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు చూపించారు. తంగలాన్ సినిమా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని అర్ధమౌతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీలో సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ స్వరాలందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ సినిమా 2024 జనవరి 26న పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది.