Virat Kohli: సచిన్‌ శతకాల రికార్డును బ్రేక్‌ చేసిన విరాట్‌ కోహ్లీ !

0

వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. బుధవారం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో కోహ్లీ 106 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఇది విరాట్‌ కోహ్లీకి ఇది 50వ శతకం. ఈ క్రమంలో సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 452 ఇన్నింగ్స్‌ల్లో సచిన్‌ 49 శతకాలు చేయగా కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 50 సెంచరీలు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌ చూసేందుకు సచిన్‌ టెండూల్కర్‌ రావడం విశేషం. సచిన్‌ సమక్షంలోనే అతడి రికార్డును విరాట్‌ బద్దలు కొట్టాడు. కాగా.. విరాట్‌ సెంచరీ చేయగానే స్టేడియంలోని ప్రేక్షకులు మొత్తం స్టాండిరగ్‌ ఒవేషన్‌లో చప్పట్లతో అతడిని అభినందించారు. సచిన్‌ తో పాటు బీసీసీఐ కార్యదర్శి కూడా చప్పట్లతో కోహ్లీని ఎంకరేజ్‌ చేశారు. కాగా.. విరాట్‌ మాత్రం సెంచరీ పూర్తి చేయగానే తాను ఎంతగానో ఆరాధించే సచిన్‌ టెండూల్కర్‌కు బోడౌన్‌ చేస్తూ నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి విరాట్‌ కోహ్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా..

విరాట్‌ కోహ్లీ (భారత్‌) - 50 శతకాలు (279 ఇన్నింగ్స్‌లు)

సచిన్‌ టెండూల్కర్‌ (భారత్‌) - 49 శతకాలు (452 ఇన్నింగ్స్‌లు)

రోహిత్‌ శర్మ(భారత్‌) - 31శతకాలు (253 ఇన్నింగ్స్‌లు)

రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) - 30 (365 ఇన్నింగ్స్‌లు)

సనత్‌ జయసూర్య (శ్రీలంక) - 28 శతకాలు (433 ఇన్నింగ్స్‌లు

రికీ పాంటింగ్‌ రికార్డు బ్రేక్‌..

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. రికీ పాంటింగ్‌ 375 వన్డే మ్యాచుల్లో 365 ఇన్నింగ్స్‌ల్లో 13704 పరుగులు చేయగా కోహ్లీ 290 వన్డేల్లో 279 ఇన్నింగ్స్‌ల్లో 13777 పరుగులతో పాంటింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్‌ 463 వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల ద్వారా 18,426 పరుగులు చేశాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా..

సచిన్‌ టెండూల్కర్‌ -  18426 పరుగులు

కుమార సంగక్కర - 14234 పరుగులు

విరాట్‌ కోహ్లీ `- 13777 పరుగులు

రికీ పాంటింగ్‌ - 13704 పరుగులు

సనత్‌ జయసూర్య - 13430 పరుగులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !