Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో కుట్ర కోణం ఉందా ?

0


విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో  చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే అనుమానం స్థానికుల్లో రేకెత్తుతోంది.  ఓ యూట్యూబర్‌ సముద్రంలో చేపల వేట గురించి స్టోరీ చేసేందుకు వీడియో చిత్రీకరించారు.  ఆ తరువాత అక్కడ  కొంతమంది ఆకతాయిలతో కలిసి  మద్యం పార్టీ చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ యూట్యూబర్‌ విదేశీ మద్యంతో పార్టీ చేసుకున్నారు.  ఇక మద్యం మత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని.. ఈ క్రమంలో ఓ రెండు పార్టీల గురించి చర్చించుకున్న సందర్భంలో మద్యం పార్టీలో గొడవకు బీజం పడిరది.  అప్పటికే  వారు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతన్నారో తెలియని పరిస్థితిలో రాడ్లు, కర్రలతో మద్యం మత్తులో కొట్టుకున్నారు.  ఈ గొడవలో ఫిషింగ్‌ హార్బర్‌లో తల్వార్లు ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయున ఆకతాయలు రెచ్చిపోయారు.  ఓ వర్గానికి చెందిన వారిని కొంతమంది రెచ్చగొట్టారా.. అన్న సందేహం కలుగుతుంది.  యూట్యూబర్‌ వీడియో రికార్డ్‌ చేసుకొని రావాల్సింది పోయి.. మత్స్యకారులకు విదేశీ మద్యంతో పార్టీ ఇవ్వడం వెనుక కుట్ర కోణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారని సమాచారం అందుతోంది. 

40 కోట్ల నష్టం !

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని...  వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది.. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.  అగ్నిప్రమాదం జరగగానికి ఓ మందు పార్టీనే.. ఆ తర్వాత జరిగిన ఘర్షణే కారణంగా తెలుస్తోంది. ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంపై విశాఖ జేసీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం ...  కొంతమంది యువకులు మద్యం మత్తులో ఫిషింగ్‌ హార్బర్‌లో హంగామా సృష్టించారని తెలిపారు.. అర్ధరాత్రి మద్యం తాగి గొడవ పడి బోటుకు నిప్పంటించారు.. కొంతమంది యువకుల మీద అనుమానం ఉందన్నారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. వారే అని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో సుమారు 35 నుండి 40 బోట్లు దగ్ధమయ్యాయి.. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అంచనా వేస్తున్నామని జేసీ విశ్వనాథం తెలిపారు.   అగ్ని ప్రమాదం ఘటనలో యూట్యూబర్‌ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని అరెస్టు...

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నానిని వన్‌ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం లోకల్‌ బాయ్‌ నాని తన భార్య శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. తన భార్య శ్రీమంతం సందర్భంగా లోకల్‌ బాయ్‌ నాని స్నేహితులకు బోటులో పార్టీ ఇచ్చారు. పార్టీ అనంతరం బోటుకు నిప్పు అంటుకుంది. లోకల్‌ బాయ్‌ నాని అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి యూట్యూబ్‌ లో అప్‌ లోడ్‌ చేశారు. ఇతర మత్స్యకారులు లంగర్‌ వేసిన బోటును వదిలారు. నిప్పు పెట్టిన బోటు జట్టి నెంబర్‌ 1లో పడవల వద్దకు చేరుకోవడంతో భారీ ప్రమాదంద జరిగింది. సిలిండర్‌ పేలడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. పడవల్లో డీజిల్‌, చేపలు ఉన్నాయి. డీజిల్‌ ఉండటంతో బోట్లు తగలబడిపోయాయి. ప్రమాద సమయంలో హార్బర్‌ లో 400 రవకు పడవలు ఉన్నాయి. 60 నుంచి 70 బోట్ల వరకు దగ్ధమయ్యాయని మత్స్యకారులు అంటున్నారు.  బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్‌ టౌన్‌ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.

మంత్రి పరిశీలన 

ఫిషింగ్‌ హర్బర్‌ వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారుల వద్దకు మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. మత్స్యకారులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. సీఎం రావాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అన్నారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. డామేజ్‌ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నేవీ, ఫైర్‌ సిబ్బంది సహాయంతో ప్రమాదం తీవ్రత ఎక్కువ అవ్వకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  గతంలో రెండు సార్లు ఫిషింగ్‌ హార్బర్‌ లో బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. హుద్‌ హుద్‌ తుఫాన్‌, తిట్లి తుఫాన్‌ సమయంలో బోట్లు డామేజ్‌ అయ్యాయని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం డ్యామేజీ బోట్లకు హామీ ఇచ్చిన నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదన్న భయంతోనే ప్రస్తుతం మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డామేజైనా ప్రతీ బోటు యజమానికి, మత్స్యకారుడికి న్యాయం చేయమని సీఎం చెప్పారని తెలిపారు. ఆకతాయిలు చేసిన పనికి ఈ ప్రమాదం జరిగిందన్నారు. కొంతమంది ఆకతాయిలను గుర్తించి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !