Vivek Resign : బీజేపీకి గడ్డం వివేక్‌ రాజీనామా...కాంగ్రెస్‌లో చేరిక !

0

అంతా అనుకున్నట్లే జరిగింది.. ఎన్నికల ముందు కమలం పార్టీకి కోలుకోలేని షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ వెంకటస్వామి బీజేపీకి గుడ్‌ బై చెప్పేశారు. బుధవారం ఉదయం కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపారు. ఇవాళ తన కుమారుడు వంశీతో కలిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో వివేక్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు. రాహుల్‌ హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఉన్నారు. కాగా.. ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టో కమిటి చైర్మన్‌గా వివేక్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వివేక్‌ ఎంపీగా బరిలో దిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలియవచ్చింది. ఆయన బాటలోనే మరికొంత బీజేపీ సీనియర్లు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్‌ శ్రేణుల్లో మరింత జోష్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్‌తో భేటీ ! 

ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. వివేక్‌తో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ పరిధిలోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్‌ గన్‌మెన్‌ కూడా లేకుండా ఒంటరిగా వచ్చారు. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్‌ ఆహ్వానించారు. అయితే.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

సీట్లు ఖాయం !

బీజేపీకి రాజీనామా ప్రకటించిన వివేక్‌.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ నోవాటెల్‌లో ఉన్న రాహుల్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. కొడుకు గడ్డం వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివేక్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలియవచ్చింది. వివేక్‌ కుమారుడు వంశీకి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఒప్పుకుందని తెలుస్తోంది. వివేక్‌ మాత్రం పెద్దపల్లి ఎంపీ బరిలోకి దిగనున్నారు. కాగా.. ఇప్పటికే వివేక్‌ సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌కు బెల్లంపల్లి టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో రానున్న మూడో జాబితాలో వివేక్‌, వంశీ పేర్లు ఉంటాయని తెలుస్తోంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !